District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ప్రతి జీ.పీ పరిధిలో పంచ వనాలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పంచ వనాలు ఏర్పాటు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి జీ.పీ పరిధిలో ఐదు రకాలకు చెందిన కనీసం వెయ్యి మొక్కలను నాటి పంచ వనాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. …

Read More »

నలుగురి ప్రాణాలు కాపాడారు – అభినందించిన సిపి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నలుగురి ప్రాణాలు కాపాడిన పెట్రోకార్‌ సిబ్బందిని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కె.ఆర్‌. నాగరాజు అభినందిస్తూ ప్రశంసించారు. వివరాలు ఇలా ఉన్నాయి… జూన్‌ 30 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో డయల్‌ 100 కు ఫోన్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి రేంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దండిగుట్ట ప్రాంతానికి చెందిన తేజావత్‌ సురేష్‌ (30), అతనికిచెందిన …

Read More »

బహరేన్‌ ఎయిర్‌ పోర్టులో చిక్కుకున్న యువకుడు

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజిట్‌ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహరేన్‌ ఎయిర్‌ పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి తండాకు చెందిన బనావత్‌ చక్రవర్తి ఈనెల 27వ తేదీన ‘గల్ఫ్‌ ఏర్‌’ ప్లయిట్‌ జిఎఫ్‌-275 ద్వారా హైదరాబాద్‌ నుండి బహరేన్‌కు వెళ్ళాడు. ఎయిర్‌ పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు. సహాయం …

Read More »

మున్సిపల్‌ కార్మికులకు పీఆర్సీ చెల్లించాలి

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 2021లో నియమించిన 330 మంది కార్మికులకు పీఆర్పీ అమలు చేయాలని బహుజన లెఫ్ట్‌ ట్రేడ్‌ యూనియన్స్‌-బిఎల్‌ టీయూ రాష్ట్ర అద్యక్షులు దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. గురువారం యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిదిలో 330 మంది కార్మికులను మున్సిపల్‌ కార్పోరేషన్‌ నియమించిందన్నారు. …

Read More »

పశువుల అక్రమ రవాణా నిరోధానికి గట్టి నిఘా

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని అదనపు కలెక్టర్‌ బీ.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బక్రీద్‌ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బుధవారం పశువుల అక్రమ రవాణా నిరోధంపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని అంతర్‌ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కందకుర్తి, …

Read More »

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఉత్తమ ఫలితాలు

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరంలో నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు మంచి ఫలితాలతో తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపల్‌ నుసరత్‌ జహాన్‌ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా స్థాయిలో తమ కళాశాల బాలికలు మంచి మార్కులు సాధించారని ప్రిన్సిపల్‌ వివరించారు. రెండవ సంవత్సరంలో ఎంపీసీ ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థిని …

Read More »

కలెక్టరేట్లో ఘనంగా గణాంక దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో బుధవారం గణాంక దినోత్సవ (స్టాటిస్టిక్స్‌ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. గణాంక పితామహుడు పీసీ.మహలనోబిస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎలాంటి ప్రణాళిక …

Read More »

జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం (డీఎంఏసి) బుధవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగింది. ఆయా ప్రింట్‌ / ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలలో పని చేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు 2022 -2024 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడిటేషన్‌ కార్డుల విషయమై సమావేశంలో కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన మీదట …

Read More »

రేపు పాలిసెట్‌ – సర్వం సిద్ధం

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని 21 పరీక్షా కేంద్రాలలో 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే పాలిసెట్‌ ` 2022 పరీక్షకు 7008 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు జిల్లా సమన్వయ కర్త శ్రీరాం కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు …

Read More »

అటెండెన్స్‌ యాప్‌ ఆధారంగానే జీతాల చెల్లింపు

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్యారోగ్య శాఖలో జిల్లా స్థాయి అధికారి మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఉద్యోగికి అటెండెన్స్‌ యాప్‌ ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు భిన్నంగా ఎవరికైనా జీతాలు మంజూరు చేస్తే, సంబంధిత డీ.డీ.ఓల నుండి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »