నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్వచ్చందంగా భాగస్వాములవుతూ, ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా లక్ష రూపాయలకు పైబడి విరాళాలు అందించిన దాతలను మా ఊరి మహరాజులుగా గుర్తిస్తూ ప్రభుత్వపరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే పల్లె ప్రగతి ముగింపు సభల్లో ఘనంగా సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 16 మంది దాతలు లక్ష …
Read More »ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని నియంత్రించాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి (డి.ఈ.వో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »తల్లిదండ్రులకు విజ్ఞప్తి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలో తమ పిల్లలను అనుమతి, గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే చేర్పించాలని తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల మై చోటా స్కూల్ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిజామాబాద్‌లో ప్రారంభించినట్టు ఫ్లెక్సీలు కనబడుతున్నాయని, ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి, గుర్తింపు లేదని, కావున తల్లిదండ్రులు అటువంటి పాఠశాలలో పిల్లలను చేర్పించకూడదని చెప్పారు. …
Read More »విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం కావాలి
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేనాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పల్లె ప్రగతిలో పెండిరగ్ పనుల విషయమై ట్రాన్స్ కో, ఎంపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పట్ల …
Read More »చెరువుల కబ్జాలను నివారించాలి
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గన్‌పూర్ గ్రామానికి చెందిన రాజరాజేశ్వరి చెరువును, నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఏదులా, ఎక్కుంట చెరువులను సమగ్ర సర్వేచేసి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని, చెరువు చుట్టూ కందకం తవ్వించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ రూరల్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్.డి.ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంథా …
Read More »త్రిబుల్ ఐటిలో సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, తాగునీటి వసతిని, …
Read More »టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా సంవత్సరం ప్రారంభమై మన ఊరు – మనబడిలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్ ప్రదీప్ అన్నారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »శ్రీశ్రీకి ప్రజా సంఘాల నివాళి
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా కవి, విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశ్రీ 39 వ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల (ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్, పివైఎల్) ఆధ్వర్యంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా కార్యాలయం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ శ్రీశ్రీ సాంప్రదాయ కవిత్వాన్ని బద్దలు కొట్టి, ప్రజా …
Read More »సర్కారు బడికి జడ్జి కూతురు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు, మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్, ప్రియాంక జాదవ్ దంపతులు. వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్‌ను నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్ చేశారు. ఈ …
Read More »డబుల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర నుండి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు జరగాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా భీంగల్ మండలం దేవక్క …
Read More »