నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెల్లవారుజామున తొలకరి జల్లు పలకరించి పరవశింపజేసింది. సాధారణంగా మృగశిర కార్తె రోజు తప్పకుండా వర్షం కురుస్తుందని భావిస్తారు. కాగా బుధవారం సాయంత్రం ఈదురుగాలులు వీచినప్పటికి వాన జాడ కానరాలేదు. కానీ తెల్లవారేసరికి వరుణుడు కరుణించాడు. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌లో పలుచోట్ల వాన ముసురుపట్టినట్టుగా కురుస్తూనే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ కూడా మూడురోజులు …
Read More »పేషంట్ వెంట ఒక్క అటెండెంట్‌నే అనుమతించాలి
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్ పేషంట్‌ల వెంట ఒక అటెండెంట్ ను మాత్రమే అనుమతించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఎక్కువ సంఖ్యలో సహాయకులు ఉండడం వల్ల ఇతర అనేక రకాల ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్నందున ఈ …
Read More »ఋణ విస్తరణలో లోన్లు మంజూరు చేశారు
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్‌లో ఋణ విస్తరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని బ్యాంకులు కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల బిజినెస్ లోన్, వ్యవసాయ రుణాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు గృహ, కార్ లోన్లు మంజూరు చేశారు. లీడ్ బ్యాంకు అధికారి ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో …
Read More »మన ఊరు – మన బడి అమలులో నిజామాబాదు జిల్లా ఆదర్శం
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలులో నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక …
Read More »‘కంటి వెలుగు’లో భాగంగా కాటరాక్టు ఆపరేషన్లు చేపట్టాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంపిక చేసిన వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన వైద్యారోగ్య శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …
Read More »నేడు ఋణ విస్తరణ కార్యక్రమం
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో గల బస్వాగార్డెన్‌లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10.00 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఋణ విస్తరణ కార్యక్రమంలో అన్ని బ్యాంకులు పాల్గొని అన్ని రకాల ఋణాలు, ఇతర …
Read More »కంజరలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశమ్మ వాగుకు ఆనుకుని వైకుంఠధామం వద్ద ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వాగు ద్వారా వచ్చే వరద జలాలను నిలువరించేందుకు వీలుగా పకడ్బందీ పనులు జరిపించాలని …
Read More »మీ భవిష్యత్తుకు మీరే మార్గనిర్దేశకులు
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి స్పష్టం చేశారు. ఏకాగ్రతతో చదువుతూ, పక్కా ప్రణాళికతో సన్నద్దమైతే కోరుకున్న ప్రభుత్వ కొలువును దక్కించుకోవడం కష్టమైన పనేమీ కాదని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవగాంధీ ఆడిటోరియంలో పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతీ, …
Read More »రాజన్న కుటుంబానికి మాట తప్పే అలవాటు లేదు
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటికీ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలో వైఎస్‌ఆర్ టీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజల గుండెల్లో రాజన్న బ్రతికే ఉన్నారని, ప్రజల్లో రాజన్న కుటుంబంపై విశ్వసనీయత ఉందని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, నినమాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినెటర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు. రాజన్న కుటుంబానికి మాట …
Read More »క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 6వ డివిజన్ వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనిలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువులొనే కాకుండా శారీరకంగా మానసికంగా దృడంగా ఉండటానికి క్రీడా ప్రాంగణాలని నిర్మిస్తున్నామని, ఇందులో వాలిబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, కబడ్డీ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు కాలనీ …
Read More »