District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

భూసారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సద్గురు ఫౌండేషన్‌ తరపున ఢల్లీికి చెందిన జయసోలంకి, ప్రతీక్‌ యాదవ్‌ అనే ఇద్దరు యువకులు దేశ రాజధాని ఢల్లీి నుండి కోయంబత్తూరు వరకు సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు …

Read More »

నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా …

Read More »

పాఠశాల స్థలాన్ని కాపాడండి

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పి.డి.ఎస్‌.యు నగర కమిటీ ఆధ్వర్యంలో కాలూర్‌ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు నగర కమిటీ అధ్యక్షులు ఎస్కే. ఆశుర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ డివిజన్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 1235/1 లో గల జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కాలూరు స్థలాన్ని కబ్జా చేసే …

Read More »

ఈ నెల 21 నుండి పోడు భూములపై గ్రామ సభలు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారికి ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పోడు భూముల పరిశీలన ప్రక్రియలో భాగంగా ఈ నెల 21 వ తేదీ నుండి హాబిటేషన్ల వారీగా గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోడు భూముల అంశంపై ఆర్దీవోలు, ఎఫ్‌డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్‌ …

Read More »

జిల్లా అధికారులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గారి ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను అంశాలపై ఆ శాఖ అధికారులచే ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉప సంచాలకులు బి.కోటేశ్వరరావు ఒక …

Read More »

విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన సూచించారు. బుధవారం ఆమె జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి తో కలిసి నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముందుగా ముబారక్‌ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, ఆయా తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. చిన్నారులను పలు …

Read More »

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయములో ఏ.వెంకటేశ్వర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ నిజామాబాద్‌ విచ్చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాఠకులను ఉద్దేశించి వారికి సలహాలు-సూచనలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పి.లక్ష్మీరాజ్యం, సహాయ గ్రంథపాలకులు పట్టెమ్‌.మధు, సిబ్బంది స్వామి, పాఠకులు పాల్గొన్నారు.

Read More »

అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారానా సూచించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆమె కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌ నగర్‌లో గల ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్‌ …

Read More »

మునిసిపల్‌ ఉద్యోగుల పెన్‌డౌన్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్‌డౌన్‌ సమ్మె మూడవ రోజుకు చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాప్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై ఓమయ్య, పి.నర్సింగరావు పెన్‌డౌన్‌ శిబిరానికి వెళ్లి ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగం …

Read More »

నిఖత్‌ జరీన్‌కు అర్జునా అవార్డు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్‌ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్‌ జరీన్‌కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్‌ తెలంగాణకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »