District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

మెండోరా హెల్్త‌సూప‌ర్‌వైజ‌ర్ స‌స్పెన్ష‌న్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీ మహిళల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీల వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయడంలో అలసత్వం కనబర్చిన మెండోరా పీహెచ్‌సి హెల్త్‌ సూపర్వైజర్‌ మీర‌మ్మ‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. పీహెచ్‌సి వైద్యాధికారిని సంజాయిషీ కోరాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ …

Read More »

కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్త రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్స్‌ డే సందర్భంగా నిజామాబాద్‌ కొత్త కలెక్టరేట్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గురువారం ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. పెండిరగ్‌లో ఉన్న పెన్షనర్ల బకాయిలను ఏక మొత్తంలో వెంటనే చెల్లించాలని, మూడు విడతల డిఆర్‌లను తక్షణమే విడుదల …

Read More »

పెండిరగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి – ఆర్‌.కృష్ణయ్య

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు రెండువేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జరిగిన విద్యార్థి …

Read More »

ఆయిల్‌ పామ్‌ సాగుతో అధిక లాభాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌ పామ్‌ పంట సాగుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో …

Read More »

భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, రేషన్‌ బియ్యం స్మగ్గ్లింగ్‌ నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పై అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, …

Read More »

నాణ్యమైన ధాన్యానికి కడ్తా తీస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు, కోతలు లేకుండా రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ధాన్యానికి ఎవరైనా కడ్తా తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడ్తా అమలు చేసే రైస్‌ మిల్లులను సీజ్‌ చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. …

Read More »

శ్రీరామ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చలి కాలం వచ్చేసింది… ఎందరో అనాథలు, అభాగ్యులు ఎముకలు కొరికే చలిలో రోడ్డుపక్కన కాలం వెళ్లదీస్తుంటారు. విషయాన్ని గమనించి స్పందించిన శ్రీరామ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు వారికి సహాయం చేయాలని ముందుకొచ్చారు. పరోపకారార్థ మిదం శరీరం అన్న సుభాషిత వాక్యాన్ని నమ్మి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. నిజామాబాద్‌లోని సుమారు వంద మందికి 31వ తేదీ …

Read More »

కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ ట్రైనీ అధికారుల (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌) క్షేత్రస్థాయి పరిశీలన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ అధికారుల బృందం అక్టోబర్‌ 31 న జిల్లాకు చేరుకున్న విషయం విదితమే. ఈ నెల 4 వ తేదీ వరకు ట్రైనీ అధికారుల బృందాలు వారికి కేటాయించిన …

Read More »

ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్నిమరింతగా ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ …

Read More »

సమాచార శాఖ (ఏ.ఆర్‌.ఈ) ఏఈఐఈకి ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్‌.ఈ) విభాగంలో సహాయ ఎగ్జిక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ (ఏఈఐఈ)గా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ చేసిన వీ.కరుణశ్రీనివాస్‌ కుమార్‌కు ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కుమార్‌, ఏడాదిన్నర కాలం పాటు ఇంకనూ తన సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »