District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

6న వానాకాలం సాగు సన్నాహక సమావేశం

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు కోసం సమాయత్తం అయ్యేందుకు వీలుగా నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 6వ తేదీన (శుక్రవారం) వానాకాలం సాగు సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మాక్లూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గల ఫంక్షన్‌ …

Read More »

ఓయూ విసి అప్రజాస్వామిక తీరును వ్యతిరేకించండి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యబద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలు, సదస్సులు, చర్చా గోష్టులు నిర్వహించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తుండగా విసి ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థిసంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, అప్రజాస్వామిక అరెస్టులను పీడీఎస్‌యూ జిల్లా కమిటీ తీవ్రంగా …

Read More »

ఎస్‌టి అభ్యర్థులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు ఉచిత శిక్షణ కోసం ఎస్‌టి గిరిజన అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించిన ఆయా మెరిట్‌ జాబితాలు సంబంధిత తహసీల్దారు, ఎంపిడివో, డిడబ్ల్యువో వారి కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అతికించడం జరిగిందని డిటిడివో ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్‌ ఆధారంగా, 50 : 50 నిష్పత్తిలో స్త్రీ పురుషులకు ఇన్స్‌పెక్టర్‌, కానిస్టేబుల్స్‌కు సంబంధిత శిక్షణ కేంద్రానికి చేరుటకు అడ్మిషన్‌ …

Read More »

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను మంగళవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రగతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం మహనీయుల …

Read More »

విద్యా యజ్ఞంలా మన ఊరు – మన బడి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం తరహాలో చేపట్టి, పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో అలరారే విధంగా పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతూ పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం …

Read More »

మెడికల్‌ కాలేజీకి శరీరదానం

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరణించిన తర్వాత తమ పార్ధివదేహాన్ని సమాజ హితం కోసం, విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి దానం చేయడం ఆదర్శనీయమైన నిర్ణయమని సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ అన్నారు. బ్రాహ్మణపల్లి సావిత్రి (80), నివాసం కేశారం గ్రామం. ఈరోజు మధ్యాహ్నం 1.28 నిమిషాలకు మరణించారు. ఆమె కూతురు విజయ అల్లుడు నారాయణ, కుటుంబ సభ్యులు …

Read More »

జిల్లా ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ముస్లిం మైనారిటీలు ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …

Read More »

ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పథకం, మన ఊరు – మన బడి, ధరణి కార్యక్రమాల అమలులో ప్రగతి గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

ఎనిమిదో విడత హరితహారం కోసం సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని, పది శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలలో పచ్చదనం గణనీయంగా మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమంలో ప్రాధాన్యత అంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సూచించారు. రానున్న తెలంగాణకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »