నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చిలోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన పెషీ చాంబర్ నుంచి, …
Read More »వడ్డీ వ్యాపారుల ఆగడాలను నియంత్రించాలి
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని, పప్పుల సురేష్ కుటుంబ సభ్యుల మరణాలకు కారణమైన బిజెపి నాయకుడు, ఇతర వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పివైఎల్, పివోడబ్ల్యు, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బి.కిషన్, ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్, పీవోడబ్ల్యూ …
Read More »ఇవిఎం గోదాం పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక ఈవీఎం గోదాం పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోదాంలను భవనాల కండిషన్‌పై పరిశీలించి నివేదిక అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో గోదాంను నిర్వహిస్తున్న మరమ్మతులను పరిశీలించారు. స్లాబ్ లీకేజీ లేకుండా చూడాలని పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. …
Read More »ఐటి హబ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టియుఎఫ్‌ఐడిసి ఎం.డి. నరసింహ రెడ్డి నగరంలోని న్యూ కలెక్టరేట్ రోడ్డులో నిర్మిస్తున్న ఐటి హబ్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులు, కాంట్రాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నగరంలో ఐటి హబ్ నిర్మాణానికి ఐటి …
Read More »అక్రమ అరెస్టులను ఖండిరచండి
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్ 317 వెనక్కి తీసుకోవాలని గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భీంగల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ విప్ అనిల్, రైతు నాయకులు అన్వేష్ …
Read More »కలెక్టర్ మీద అభిమానంతో…
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం ఫ్రెండ్ పల్లి గ్రామానికి చెందిన సందేశ్ కుమార్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చిత్రాన్ని గీసి కలెక్టర్‌కు స్వయంగా బహుమానంగా ఇచ్చారు. కష్టపడి జిల్లా కలెక్టర్‌గా ఎదిగినందుకు ఆయన మీద అభిమానంతో చిత్రాన్ని వేసినట్టు తెలిపారు. కాగా సందేశ్ కుమార్ ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాడు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ తనపై …
Read More »వేతన పెంపు ఐక్య పోరాట విజయం
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతన పెంపును అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) …
Read More »డిగ్రీ, పిజి తరగతులు వాయిదా
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పిజి తరగతులు ఉమ్మడి జిల్లా అధ్యయన కేంద్రాలు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, మోర్తాడ్, ఆర్మూర్, భీమ్‌గల్, బిచ్కుంద, ఎల్లారెడ్డి లో కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం వల్ల వాయిదా వేసినట్టు అధ్యయన …
Read More »హరితహారం మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడడం ద్వారా వచ్చే సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్ అవసరం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి హరితహారం, ఓమిక్రాన్, లేబర్ టర్న్ ఔట్‌పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం …
Read More »రేపటికల్లా పిల్లలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపటికల్లా 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్య శాఖ అధికారులు, ఆర్‌డివోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్‌పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ పిల్లలపైన ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల 15 …
Read More »