నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ నిజామాబాద్ ఛైర్మన్‌గా తాను ఎన్నిక కావడానికి తోడ్పాటును ఇచ్చిన బుస్స ఆంజనేయులుకు, డా.నీలి రాంచందర్‌కు, తోట రాజశేఖర్‌కి, కరిపె రవిందర్‌కి రామకృష్ణకు రెడ్ క్రాస్ సిబ్బందికి నరాల సుధాకర్ ధన్యవాదములు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌లోని స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ఎన్నికల అధికారి దక్షిణ మండలం తహసిల్దార్ ప్రసాద్ రెడ్ క్రాస్ నగర కార్యవర్గానికి ఎన్నికలు …
Read More »జనవరిలో రాజకీయ శిక్షణా తరగతులు
ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ తెలిపారు. శిక్షణా తరగతులు ఆర్మూర్ విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల …
Read More »ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2021`22 విద్యా సంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్లకు ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ బాలికల ఐటిఐ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని వారు ఐదవ విడత ఈనెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …
Read More »డిగ్రీ, పిజి తరగతులు వాయిదా
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 19న ఆదివారం జెఎన్‌టియు (పంచాయతీ రాజ్) రిక్రూట్‌మెంట్ టెస్ట్ సెంటర్ ఉన్నందున ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తరగతులు జనవరి 2, 2022 నుండి యథావిధిగా నిర్వహింపబడతాయని, …
Read More »ప్రతి విద్యార్థికి ప్రతిభ సర్టిఫికెట్ అందజేస్తాం
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణిత పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేస్తున్నట్ల తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడ్వాయి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రామానుజన్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 21న పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ గణిత ఫోరం …
Read More »రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కార్యవర్గపు గడువు ముగిసిన పిదప రాష్ట్ర గవర్నర్ సెక్రటరీ ఆదేశాల మేరకు నిజామాబాదు జిల్లా పాలనాధికారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబడినది. మండల స్థాయి ఎన్నికలు 20 డిసెంబర్ రోజున మండల కార్యాలయంలో నిర్వహించబడును, అదేవిదంగా నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికలు జిల్లా రెడ్ క్రాస్ భవనం నందు నిర్వహించబడునని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా …
Read More »అర్బన్ అటవీ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ఆర్మూర్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్బన్ అటవీ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆమె పలు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. మాక్లూర్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాలలో పర్యటించారు. మాక్లూర్ అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి …
Read More »మున్సిపల్ కార్మికుల వంటా వార్పు
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసికొని భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …
Read More »ఇంధన పొదుపుపై అవగాహన
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్‌కో గురువారం జిల్లా పరిషత్ నిజామాబాద్ ఆవరణలో ఇంధన పొదుపుపై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రజలకి ఇంధన పొదుపు పై, సోలార్ వాడకంపై అవగాహన కల్పించారు. స్టాల్‌ను జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, జెడ్‌పిటిసిలు తదితరులు సందర్శించారు. వీరికి టీఎస్ …
Read More »కొత్త కలెక్టరేట్ పరిశీలించిన ప్రియాంక వర్గీస్
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్త కలెక్టరేట్‌లో సదుపాయాలను, సౌకర్యాలను, హరితహారం మొక్కలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా కొత్త కలెక్టరేట్‌లో ఆకర్షణీయంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటించారని ప్రశంసించారు. గార్డెన్‌లో కొన్ని రకాల అందమైన పూల మొక్కలు పెట్టించాలని సూచించారు. …
Read More »