District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

సర్కారు బడికి జడ్జి కూతురు

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు, మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జాదవ్‌, ప్రియాంక జాదవ్‌ దంపతులు. వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్‌ను నిజామాబాద్‌ నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్‌ చేశారు. ఈ …

Read More »

డబుల్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర నుండి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్‌ రోడ్డు పనులు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు జరగాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా భీంగల్‌ మండలం దేవక్క …

Read More »

విధుల నిర్వహణ కోసం అటెండెన్స్‌ యాప్‌తోనే హాజరు

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర పరిధిలోకి వచ్చే వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశ్యంతోనే అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్దతి కొనసాగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అటెండెన్స్‌ యాప్‌ ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వైద్యారోగ్య …

Read More »

నిజామాబాద్‌ రెడ్‌ క్రాస్‌కు అవార్డుల పంట

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగ హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌ కమ్యూనిటి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాదుకు చెందిన పలువురికి అవార్డులు వరించాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే ప్రపంచ పండుగ అని గవర్నర్‌ డా.తమిళి సై అన్నారు. మనకు తెలవని వారి ముఖంలో కూడ సంతోషం నింపేది రక్తదానం అన్నారు. తన కేర్‌ డిగ్రీ కళాశాల ద్వారా …

Read More »

కేంద్ర మంత్రిని కలిసిన న్యాయవాదులు

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర పాండేను నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌ నగర్‌లో గల నిఖిల్‌ సాయి హాల్లో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆనంద్‌, ప్రధాన …

Read More »

హరితహారానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఆశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమై హరితహారం అమలుపై దిశా నిర్దేశం చేశారు. రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురియనున్న దృష్ట్యా …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …

Read More »

జిల్లా జనరల్‌ ఆసుపత్రి తనిఖీ, కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ జిల్లా జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ నెల 18న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు జిల్లా పర్యటనకు హాజరవుతున్న సందర్భంగా జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో వృద్ధుల కోసం సుమారు 50 లక్షల రూపాయలను వెచ్చిస్తూ నూతనంగా నెలకొల్పిన ‘ఆలన’ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే స్కిల్‌ …

Read More »

డయల్‌ 100 సిబ్బందికి అభినందన

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముగ్గురి ప్రాణాలను కాపాడిన డయల్‌ 100 సిబ్బందిని అభినందిస్తూ నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ నాగరాజు ప్రశంసించారు. 9వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో డయల్‌ 100 కు ఫోన్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ యందు వరంగల్‌ జిల్లాకు చెందిన సుమలత (40), శ్రీనిఖీ (14), శ్రీహిత (10) లు ఇంట్లో …

Read More »

బస్సు చార్జీలు తగ్గించాలి

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో శివాజీనగర్‌ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీజిల్‌ ధరల పెంపును సాకుగా చూపి రెండుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచిందన్నారు. ఇప్పుడు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »