District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

‘పది’ పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సి పరీక్షలపై …

Read More »

ముగ్గురిపై మాల్‌ప్రాక్టీసు కేసు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కెమిస్ట్రీ , కామర్స్‌ రెండవ సంవత్సరం ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాగా 870 మంది విద్యార్థులు గైర్‌ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తెలిపారు. మొత్తం 17,011 మంది విద్యార్థులకు గాను 16,141 మంది విద్యార్థులు హాజరుకాగా 94.9 శాతం విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. గురువారం తాను జిల్లా …

Read More »

అత్యధిక కొలువులు సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరపజేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్‌లు వెలువరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువతీ, యువకులు అధిక సంఖ్యలో ఉద్యోగాలను సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరప చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాలు, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో …

Read More »

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు 2021- 2022 సంవత్సరానికిగాను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. సుమారు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండాకాలంలో వార్షిక పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామనీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్‌, పోస్టల్‌ శాఖ, ఆర్టీసీ, విద్యుత్తు తదితర శాఖల సమన్వయంతో …

Read More »

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలు ఈనెల 29న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రెండవ మహాసభ ఉదయం 10 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మహాసభ ఉంటుంది. మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అధ్యక్షత …

Read More »

ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఇంటర్‌ పరీక్షలలో ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయినట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,961 మంది విద్యార్థులకు గాను 16,182 మంది విద్యార్థులు హాజరుకాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారని తెలిపారు. నిజామాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ …

Read More »

పనితీరు మెరుగుపర్చుకోకుంటే కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీహెచ్‌సిల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్‌ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్‌ తదితర …

Read More »

నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని తదితర సిబ్బంది మంగళవారం ఉదయం నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ… నిశిత కళాశాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా వీసీ ఆదేశించారని అన్నారు. చాలినన్ని …

Read More »

19న ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అదికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డ్స్‌ హైదరాబాద్‌ జిల్లా 1. బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, 2. బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, యూనిట్‌ మేనేజర్‌ ఉద్యోగాలున్నాయన్నారు. 18 సంవత్సరాల నుండి …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో పదవరోజు మంగళవారం జిల్లాలో కాపి చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 956 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్‌ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. రెండవ సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలకు మొత్తం 17,815 మంది విద్యార్థులకు గాను 16,859 మంది విద్యార్థులు హాజరుకాగా 956 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »