District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

గాంధేయ మార్గంలో పోరాడుతాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో పోరాడుతామని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్‌ బుస్సాపూర్‌ శంకర్‌ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ నగరంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సత్యం, ధర్మం, అహింస ఆయుధాలుగా చేసుకొని శాంతియుతంగా పోరాడినట్లుగానే …

Read More »

జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులను వెంటనే కోవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి, రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్ధిక సహాయంగా రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్స్‌ సబ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ …

Read More »

మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్‌.ఎస్‌యు.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ శాంతి సత్యం అహింస అనే నినాదంతో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి, భారతమాత దాస్య శృంఖలాలను తెగనరికి, దేశ ప్రజలకు …

Read More »

గాంధీజీ అహింసా మార్గమే అనుసరణీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ., ఎం.కాం., ఎంఎస్‌సి, ఎంబిఏ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల 200 రూపాయల అపరాధ రుసుముతో 13 అక్టోబర్‌ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …

Read More »

పిల్లల చిరునవ్వుతో వృద్ధుల వయసు రెట్టింపు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల చిరునవ్వు, పలకరింపులతో వారి తల్లిదండ్రుల ఆరోగ్యం రెట్టింపవుతుందని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా శుక్రవారం మహిళ-శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన సీనియర్‌ సివిల్‌ జడ్జి డిఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా …

Read More »

దుబాయ్‌ టోర్నీకి గుగులోత్‌ సౌమ్య…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి గుగులోత్‌ సౌమ్య మరొకసారి తన ప్రతిభను చాటి భారత దేశ మహిళా ఫుట్‌బాల్‌ టీమ్‌కు సెలక్ట్‌ అవ్వడం గర్వకారణం అని కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్‌ అన్నారు. అక్టోబరు 2వ తేదీ నుండి దుబాయిలో నిర్వహించనున్న స్నేహ పూర్వక మ్యాచ్లు ఆడడానికి భారతదేశ మహిళా జట్టుకు సౌమ్య ఎన్నిక …

Read More »

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఎలక్ట్రిక్‌ వాహనంపై తిరుగుతూ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు. రైల్వే కమాన్‌ వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్‌ భవనాన్ని పరిశీలించారు. వినాయక్‌ నగర్‌లో పుట్‌ పాత్‌ పనులని పరిశీలించి సూచనలు చేశారు. అహ్మది బజార్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ …

Read More »

వర్షాల వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో …

Read More »

భగత్‌సింగ్‌ ఆశయాలను కొనసాగిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్రోద్యమ యువ కెరటం కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా కోటగల్లీలో గల భగత్‌ సింగ్‌ విగ్రహానికి పి.డి.ఎస్‌.యు, పీవోడబ్ల్యూ, పీవైఎల్‌, ఐ.ఎఫ్‌.టీ.యు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ దోపిడీ పీడనలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »