District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, నీటమునిగిన ఇండ్లను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. మంగళవారం నగరంలోని ఆటోనగర్‌, నయా బ్రిడ్జి ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు పరిశీలించారు. టీంలను ఏర్పాటు చేసి నష్టాన్ని అంచనా వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గూపన్‌పల్లి నిర్వాసితులు గంగ …

Read More »

జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నుండి నియోజకవర్గానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్సారెస్పీ ఎస్‌.ఈ శ్రీనివాస్‌, సీ.ఈ సుధాకర్‌లతో వర్షాలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. పలు అంశాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం …

Read More »

జలమయమైన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల వల్ల నిజామాబాద్‌ నగరంలో జలమయమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పర్యటించి పరిశీలించారు. మంగళవారం మున్సిపల్‌ ఇతర అధికారులతో పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో గల చంద్రశేఖర్‌ కాలనీలో జలమయమైన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్‌ సిబ్బందితో పనులు పూర్తి చేయిస్తామని వర్షపునీరు నిలవకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు …

Read More »

ప్రతి అధికారి హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రోజంతా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నందున జిల్లా యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అధికారి తప్పనిసరిగా హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలని మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు …

Read More »

నిజామాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి పోలీసులు హెచ్చరిక జారీచేశారు. వాగులు, కాలువలు, నదులు రిజర్వాయర్‌ల వద్దకు ప్రజలు వెళ్ళరాదని, ముఖ్యంగా పిల్లలు యువకులు వెళ్ళవద్దని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని, నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్ళరాదని, నాలాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులను దాటరాదన్నారు. చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో …

Read More »

రోజంతా భారీ వర్ష సూచన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్ని విద్యా సంస్థలకు లోకల్‌ హాలిడే ప్రకటించారు. ప్రజల రక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి అధికారి హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలని, ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కారించాలని, పోచంపాడ్‌ నిజాంసాగర్‌ ప్రాజెక్టుల అధికారులు మరింత …

Read More »

పోషణపై విస్తృత అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషణ మాసోత్సవాలపై మారుమూల ప్రాంతాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోషణ మాసోత్సవాలు, భారీ వర్షాలు, వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, విద్యా శాఖలో వ్యాక్సినేషన్‌, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు మున్సిపాలిటీలో బృహత్‌ పట్టణ, టీఎస్‌ ఐపాస్‌పై …

Read More »

గణేష్‌ మండలి నిర్వాహకులు పాటించవలసిన నియమాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక ప్రతిమలు ప్రతిష్టించే గణేశ్‌ మండగలి నిర్వాహకులకు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ పలు సూచనలు చేశారు. గణేష్‌ విగ్రహ ఏర్పాటు కోనం వ్రజల నుండి డబ్బులను బలవంతంగా వనూలు చేయరాదని, గణేష్‌ మండపాలను ఎవరికి ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేనుకోవాలని, మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం నంబంధిత వారితో అనుమతి తీసుకోవాలని, గణేష్‌ మండళ్ల …

Read More »

జీవో నెం. 60 వెంటనే అమలు చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) …

Read More »

రౌడీ షీటర్లపై నిరంతర నిఘా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణపతి, దసరా, దేవి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్‌ లోని రౌడీ షీటర్లకు పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, రౌడీ షీటర్ల ప్రతి కదలికపై పొలీస్‌ వారి నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »