District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరపాలక సంస్థలో నూతనంగా నియమింపబడ్డ పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ఐదు నెలల క్రితం నూతనంగా ఏజెన్సీ ద్వారా 330 మంది పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన కార్మికులు, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం …

Read More »

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు చేయాలి

మాక్లూర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా కిసాన్‌ మోర్చా మాక్లూర్‌ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షులు నల్ల గంగా మోహన్‌ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో లక్ష రపాయల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఉచితంగా ఎరువులు అందజేయాలని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. …

Read More »

సీజనల్‌ వ్యాధులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ప్రజలు …

Read More »

ఆహ్లాద వాతావరణంలో ఎట్‌ హోమ్‌ ప్రోగ్రాం

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ఎట్‌ హోమ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అందులో చందన శ్రీనివాస్‌ మ్యాజిక్‌ ఆకట్టుకుంది. మెజీషియన్‌ రంగనాథ్‌ కార్యక్రమాలు అందరిని ఆశ్చర్య చకితులను చేశాయి. బొమ్మతో మిమిక్రి పిల్లలను, పెద్దలను ఒప్పించింది. కళాకారులు అష్ట గంగాధర్‌ పాటలతో అదేవిధంగా చిన్నారి డాన్స్‌ను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా …

Read More »

ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరం

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మోస్రా ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నిజామాబాద్‌ వారి సౌజన్యంతో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ జి. హరికృష్ణ ఎంబిబిఎస్‌ డిసిహెచ్‌ (నీలోఫర్‌) సమక్షంలో ఆదివారం మోస్రా, పరిసర ప్రాంతాల పిల్లలకు సీజనల్‌ వ్యాధులు డెంగీ, మలేరియా టైఫాయిడ్‌ వాటి పైన అవగాహన కల్పించి ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరం నిర్వహించారు. …

Read More »

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ నగరంలోని 7 వ డివిజన్‌ లోని చంద్ర నగర్‌, సూర్య నగర్‌లో ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో రాష్ట్ర …

Read More »

జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్రం సిద్ధించి 75 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకీ అమ ృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సందర్భంగా జిల్లాలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అధికారులు అనధికారులతో …

Read More »

జాగృతి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ జాగృతి నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రామ్‌ కిషన్‌ రావు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని గుర్తు చేశారు. వారి త్యాగాలు వృధా పోరాదని పేర్కొన్నారు. దేశాన్ని మనము అభివృద్ధి చెందేలా చూడాలని అందరూ …

Read More »

ఆసరా పెన్షన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 57 సంవత్సరాలు దాటిన పేదలైన అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా ఆసరా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈడిఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితంగానే ఈ సేవలు లభిస్తాయని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే స్థానిక తహసీల్దార్‌కు లేదా 1100 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని …

Read More »

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆకర్షణీయంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిర్వహించుకునే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో అత్యంత పకడ్బందీగా, ఆకర్షనీయంగా ఉండేవిధంగా ఏర్పాట్లు జరగాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »