District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్‌-టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో, డీఈవో కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేసినారని, కానీ అకౌంటెంట్‌లకు …

Read More »

అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిశితంగా పరిశీలించాలి…

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి ఆరోగ్యం సర్వే, హరితహారం మొక్కల నిర్వహణ, కొవిడ్‌ నియంత్రణకై చేపడుతున్న వాక్సినేషన్‌ కార్యక్రమాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే వివరాల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం …

Read More »

యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్‌ …

Read More »

జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్‌ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో …

Read More »

నిర్లక్ష్యానికి తావిచ్చి… సస్పెన్షన్‌ పరిస్థితి తెచ్చుకోవద్దు

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్‌ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, …

Read More »

ప్రైవేట్‌ వ్యాపార సముదాయాల ఆవరణల్లోనూ మొక్కలు నాటించాలి

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్‌ గ్రామ శివార్లలోని నిజామాబాదు హైదరాబాద్‌ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్‌ బ్యాంకులు, మార్బల్‌ షాప్స్‌ …

Read More »

అభ్యుదయానికి పట్టం కట్టిన భండారు అచ్చమాంబ

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి త్రివేణి అన్నారు. బుధవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి …

Read More »

పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో పకడ్బందీగా అమలు చేయాలని, ఎవరైనా తమ పనితీరును మార్చుకోకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. హరితహారంను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాదు గ్రామీణం, మోస్రా, చందూర్‌, వర్ని మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని …

Read More »

జర్నలిస్టుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల సాక్షి దినపత్రిక విలేఖరి పోశెట్టి పై దాడి చేసిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేసి దాడికి సూత్రధారులైన వారిని కూడా అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ నగరంలోని ద్వారక నగర్‌ ఇఫ్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు వనమాల సత్యం, …

Read More »

హరితహారం, దళిత బంధు ప్రాధాన్యతాంశాలు

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి హరితహారం, దళిత బంధు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »