District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

అన్ని రంగాలలో మహిళలు రాణించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మార్చి 12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ తెల్లవారుజామున 4.13 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 1.38 వరకుకరణం : తైతుల ఉదయం 9.38 వరకుతదుపరి గరజి రాత్రి 9.56 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.40 – 5.20దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌ క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల చొరవ

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో లేఔట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌.ఆర్‌.ఎస్‌) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చి) 31 లోపు పూర్తి స్థాయి ఎల్‌.ఆర్‌.ఎస్‌ ఫీజుతో పాటు ప్రో-రాటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు …

Read More »

వరి పంటను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి …

Read More »

పసుపు పంట విక్రయాలపై పకడ్బందీ పర్యవేక్షణ

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌ లో పసుపు పంట విక్రయాలపై గట్టి పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా వారు మోసాలకు గురి కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. పసుపు క్రయ విక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత …

Read More »

పంటల పరిరక్షణే ప్రభుత్వ కర్తవ్యం

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్జువ అవుతున్నాయని, ఈ విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం డాక్టర్‌ బి.ఆర్‌.అంబెడ్కర్‌ సచివాలయం నుండి సహచర …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మార్చి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 9.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష తెల్లవారుజామున 3.07 వరకుయోగం : అతిగండ మధ్యాహ్నం 2.36 వరకుకరణం : బాలువ ఉదయం 9.29 వరకుతదుపరి కౌలువ రాత్రి 9.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.38 – 5.16దుర్ముహూర్తము : ఉదయం 8.37 …

Read More »

జిల్లా పాలనాధికారిని కలిసిన సీ.పీ

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన సీ.పీని కలెక్టర్‌ స్వాగతిస్తూ, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు …

Read More »

సోమవారం ఇంటర్‌ పరీక్షల్లో 417 గైర్హాజరు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం రెండవ సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. మొత్తం 417 మంది విద్యార్థులు ఆబ్సెంట్‌ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 16,297 మంది విద్యార్థులకు గాను 15,880 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 97.4 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు …

Read More »

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీపీఓ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »