నిజామాబాద్, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిజామాబాద్‌లో గల కేర్ డిగ్రీ కళాశాలలో సాయమ్మ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వైఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని హాజరు శాతం పెంచుతామని మాటల్లో చెబుతున్నా వాటికి తోడ్పాటును అందిస్తున్న …
Read More »రెండువేల నోటుపై కవిత
నిన్ను చూసి ఎన్నిరోజులైందో ?నీ స్పర్శ లేక ఎన్నినెలలు దాటిందో?నీకేం, ఎక్కడున్నా బానే ఉంటావ్,తళతళా మిళమిళలతో, నవ్వకుఏం బాగు అది? చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూఒంటరిగా,ఏసిలో ఉన్నా నీకు చెమటలేగా !సరెలే, నీలాంటి సోపతితోనే నీకేం ధైర్యం వస్తది?నలుగురితో ఉండాలనలుగురిలో ఉండాల,చెమట చేతులను తాకినపుడునీవు కడుపునింపే అన్నమైనావు,కష్టాల జేబులలో దూరినపుడునీవు కండ్ల నిండా పండుగైనావు,చదువులను గట్టెక్కించే దారివైనావు,పెళ్ళిలను వెలిగించే దీపమైనావు,అదంతా గతమే,నీవు లేక ఏళ్ళే గడిచే,ఏదో వలసవెళ్ళినట్లు-ఐనా ఎప్పటికైనా నిన్ను చూస్తం లే …
Read More »ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలోకి
ఎడపల్లి, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సర్పంచ్ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు హైదరాబాద్‌లో నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్ …
Read More »మైనారిటీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి
నిజామాబాద్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీలతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ టెలిఫోన్ కాలనీలో గల …
Read More »వ్యవసాయంలో ఏ.ఈ.ఓల పాత్ర క్రియాశీలకం
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో సాగు రంగమే ప్రధాన ఆధారంగా ఉన్నందున వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏ.ఈ.ఓలు) క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. క్షేత్రస్థాయిలో అనునిత్యం రైతులను కలుస్తూ, వారి ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా పని చేయాలని హితవు పలికారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల …
Read More »నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణిచివేయాలి
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి సూచించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం …
Read More »హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలి
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ.దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ …
Read More »అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు
నిజామాబాద్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, …
Read More »పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 సెప్టెంబర్ 9న సిరికొండ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విదులు నిర్వహిస్తున్న ఎస్.కె. భాషా రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సెన్స్ రూపంలో గల చెక్కు ఐదు లక్షల రూపాయలను శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా మృతుడు ఎస్.కె. భాషా సతీమణి …
Read More »నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారి సేవలను కొనియాడారు. మదర్ థెరిస్సా వారసులు మీరని ఎలాంటి కల్మషం లేకుండా పేషంట్స్ కి మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిదన్నారు. శుక్రవారం అంతర్జాతీయ నర్స్‌ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ దవాఖాన లో నర్సులు, వైద్యబృందంతో కలిసి వేడుకల్లో పాల్గొని,కేక్ …
Read More »