District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, …

Read More »

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో భారతరత్న డా బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 14 డా.బీ ఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, పోటీలలో పాల్గొనే …

Read More »

భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్‌ వద్ద చేపడుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. నిజామాబాద్‌ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్‌ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …

Read More »

ప్రజావాణికి 40 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు డీఆర్డీఓ చందర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, నిజామాబాదు ఆర్దీఓ …

Read More »

నిజామాబాద్‌కు 29మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది …

Read More »

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ వేడుకలో ప్రజలను భాగస్వాములు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ వేడుక కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని సంకల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి అన్నారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆమె అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, …

Read More »

అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ, ప్రస్తుతం పంటల సాగు స్థితిగతులు, రబీలో …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఇటీవలే పూర్తయిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

9న బహుభాషా కవి సమ్మేళనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంశం భారత దేశ ప్రజలు సామరస్య సహజీవనం, కావున నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని తెలుగు హిందీ, ఉర్దూ, భాష పండితులందరూ అంశంపై మంచి కవిత్వాన్ని రాసి జమీలుల్లా, కె.వి రమణ చారి, గంట్యాల ప్రసాద్‌, బి .ప్రవీణ్‌ కుమార్‌, మాక్బూల్‌ హుస్సేన్‌ …

Read More »

ఆసుపత్రి సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పట్టణంలోని ఖలీల్‌వాడిలోగల శివగంగ ఇ.ఎన్‌.టి. ఆసుపత్రిలో అర్హతలేని వైద్యురాలు మార్చి 17వ తేదీన అబార్షన్‌ చేయడం జరిగిందని, కాగా సదరు ఆసుపత్రిని బుధవారం సీజ్‌ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటేశ్‌, డాక్టర్‌ వి.రాజేశ్‌, బి. గంగాధర్‌ తదితరులున్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »