అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
Read More »అభ్యుదయానికి పట్టం కట్టిన భండారు అచ్చమాంబ
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి త్రివేణి అన్నారు. బుధవారం కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి …
Read More »అల్లకొండ సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం
బాల్కొండ, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్టోబర్ 2 వ తేదీ శనివారం అల్లకొండ సాహిత్య కళా పీఠము-బాల్కొండ ఆవిర్భావ సభతో పాటు బతుకమ్మ అంశంపై కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్టు కళా పీఠము వ్యవస్థాపకులు కంకణాల రాజేశ్వర్ గురువారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైదిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య శ్రీధర …
Read More »కాలం నాడీ తెలిసిన ప్రజాకవి కాళోజీ
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాళోజీ నారాయణరావు కాలం నాడీ తెలిసిన వాడని, ప్రజల కన్నీళ్లు తుడిచిన కర్మజీవి అని, ప్రజల జీవితాలను కవిత్వీకరించిన ప్రజాకవి అని ప్రముఖ అర్షకవి ఆచార్య శ్రీధర అన్నారు. ఆయన గురువారం కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …
Read More »కలెక్టరేట్‌లో కాళోజీ జయంతి వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కాలోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను, …
Read More »గురుభ్యోనమః
అచ్చులన్నీ అచ్చుపోసి..హల్లులు హరివిల్లులా..పదాలపారాణి అద్ది..ఆ శర్వాణి పాదాలకుఅక్షరనీరాజనం అర్పించువాడు గురువు. తల్లిదండ్రి జన్మనిచ్చి..తప్పటడుగులు వేయిస్తే..మనలో జ్ఞానజ్యోతినివెలిగించి తప్పుడడుగులుపడకుండా కాపాడే అదృశ్యశక్తిగురువు..మన అజ్ఞానాంధకారాన్ని తొలిగించే ఆపద్భాంధవుడు గురువు… ఆలోచన పెంచేది గురువే..వివేచన కలిగించేది గురువే..మన హృదిలో విజ్ఞానసుమాలు పూయించిజీవితాన్ని ఓ నందనవనంలామార్చేది గురువే…దేశానికి రాజైనా, చక్రవర్తి అయినా మోకరిల్లేది గురువుకే.. సంస్కారబీజాలనుఅంకురార్పణ చేస్తూకాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మంలాంటి వాడు గురువు..జీవన రణక్షేత్రంలోవ్యక్తిత్వవికాస గీతను బోధించే కృష్ణుడంతడి వాడు గురువు..జగతిని సన్మార్గంలో నడిపేజగద్రక్షకుని లాంటి …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి…
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, హాకీ మాంత్రికుడు క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు …
Read More »తెలంగాణ కవి రాజు నంబి శ్రీధర రావు
నిజామాబాద్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి పద్యం రసోదయంగా రచించడం నంబి శ్రీధర్ రావు ప్రత్యేకత అని ప్రసిద్ధ లాక్షణికుడు రాజశేఖరుడు చెప్పినట్టు ఇదే కవిరాజు లక్షణమని ప్రసిద్ధ కవి అవధాని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అన్నారు. ఆయన గురువారం నిజామాబాద్ నగరంలోని లలితా దేవి ఆలయంలో ప్రముఖ కవి నంబి శ్రీధరరావు రచించిన శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీధరీయం గ్రంథాల ఆవిష్కరణ సభలో ముఖ్య …
Read More »ఒట్టేసి చెబుతున్నా
నువ్వు లేని గుండె గాయాల దిబ్బగా మారింది నువ్వు లేని మనసు పీడకలల ఆచూకీ గా మారింది నా మేధస్సును నీ ఆలోచనలు చుట్టుముట్టాయి ఏ క్షణం నువ్వు నా కంట చూసావో ఆ క్షణమే నీకు నా మనసు రాసి ఇవ్వబడిరది దుఃఖాల సాగరాలతో మోసపూరిత మాటలతో నా మనసు కాగితాన్ని తడిపేసి పోయావు పెదాలపై నీ పేరు చిరు సంతకంగా మారే లోపే పదునైన మాటలతో పెదాల …
Read More »డాక్టర్ త్రివేణికి అపురుప అవార్డు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణికి ‘‘వ్యాసరచన’’ విభాగంలో అమృతలత – అపురూప అవార్డును రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమెల్సీ సురభి వాణిదేవీ, విశిష్ట అతిథిగా భాషా సాంస్క ృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును …
Read More »