ఎంత ధనమును గడించిన నింతేనా? యని తపింతు రిందిర కృపకై ! సుంతంబయినను తెలివిని సంతసమొందుచు విడుతురె శారదపదమున్. తిరునగరి గిరిజా గాయత్రి
Read More »సుభాషితం!
కందపద్యం డెందము నుప్పొంగగ గో విందుని చరితామృతమును వేడుకలొదువన్ అందముగను గొనియాడిన పొందుదురిల మోక్షపదవి పుడమిన్ జనులున్!! సుప్పని సత్యనారాయణ సెల్ ః 94926 26910
Read More »నేటి పద్యం
ఆటవెలది అవసరముల కొరకు నాత్మీయతను జూపి చెదలు పట్టినటుల జేరి పిదప మాటలాడినవిక మార్పులన్ జేతురే ! లాభపడగ నెంచి లోభమునను తిరునగరి గిరిజా గాయత్రి
Read More »నేటి పద్యం
తేటగీతి మధుర పలుకుల నుడివెడి మనిషి జన్మ మికను వచ్చునో లేదో యనెవరి కెరుక? వాక్కు నొసగిన శ్రీ హరి పదము పాడి జన్మ ధన్యము నొనరింతు శరణు వేడి! తిరునగరి గిరిజా గాయత్రి
Read More »