Education

కళాశాలలను పర్యవేక్షించిన వీసీ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మంగళవారం వివిధ కళాశాలలను సందర్శించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల, కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల, న్యాయ కళాశాలలను పర్యవేక్షించారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యబోధనా తరగతులు దగ్గర పడుతుండడం వల్ల వీసీ అన్ని కళాశాలలను తిరిగి సందర్శించారు. వివిధ తరగతి గదులకు …

Read More »

విద్యార్థి దశలో కష్టపడితే… జీవితమంతా సంతోషాలే

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశలో ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే, జీవితమంతా సుఖసంతోషాలతో గడపవచ్చని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్య అనే ఆయుధాన్ని అనుకూలంగా మల్చుకుంటే, ఉన్నత స్థానంలో స్థిరపడి కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల బీసీ హాస్టల్‌లో ప్రేరణ కార్యక్రమం …

Read More »

అధ్యాపకులు పరిశోధనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఒప్పంద సహాయ ఆచార్యుడు డా. వి. జలంధర్‌ రచించిన ‘‘గ్రాస్సెస్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌’’ అనే పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులందరు పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పరిశోధనా పత్రాలు, నూతన గ్రంథాలు ఆవిష్కరించాలని …

Read More »

ఇంటర్‌ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్‌ పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్ష …

Read More »

నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు విధుల రొటేషన్‌ అమలు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు రొటేషన్‌ పద్ధతిలో విధుల మినహాయింపు ఇవ్వాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌-టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ ఈరోజు నుండి అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లకు పదవతరగతి మినహా …

Read More »

ఎస్‌ఎస్‌సి పరీక్షల ఏర్పాట్లపై 25న సమావేశం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్ల విషయమై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వీ. దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌సి వార్షిక పరీక్షలను సాఫీగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో సూచనలు చేయడం …

Read More »

భారతదేశ నూతన నావిగేషన్‌ వ్యవస్థకు జియో విభాగం పని తీరు భేష్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మాటిక్స్‌ విభాగం,ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సౌత్‌ క్యాంపస్‌లో ఇండియన్‌ జి.పి.ఎస్‌. నావీక్‌ అండ్‌ ఇట్స్‌ ఫ్యూచర్‌ అప్లికేషన్స్‌ అనే అంశంపై జాతీయ కార్యశాల నిర్వహించడం జరిగిందని, అలాగే సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయబడిన నూతన జి.ఐ. ఎస్‌ అండ్‌ జి.పి.ఎస్‌.జియో ల్యాబ్‌ని తెలంగాణ విశ్వ విద్యాలయ …

Read More »

పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్‌ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సేక్టోరియల్‌ అధికారి గంగా కిషన్‌ సందర్శించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల నైపుణ్యాలను పరీక్ష చేసి విద్యార్థులను అభినందించారు. పాఠశాల అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డి.ఈ.ఓ రాజు మాట్లాడుతూ …

Read More »

‘‘విలక్షణ పివి’’ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ పరిశోధకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ రాజకీయ కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జీవితంపై రచించిన ‘‘విలక్షణ పివి’’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయనాయుడు హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. ఉపరాష్ట్రపతి …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌లో శ్రీశైలంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని పరిశోధక విద్యార్థి గాలిపల్లి శ్రీశైలంకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో శుక్రవారం ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహింపబడిరది. మాస్‌ కమ్యూనికేషన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేసి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »