Education

డ్రగ్స్‌ నిషేధానికి విద్యార్థులు సమాయత్తం కావాలి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ డ్రగ్స్‌ నిషేదానికి విద్యార్థులందరు సమాయత్తం కావాలని కోరారు. డిచ్‌ పల్లిలోని ఎస్‌. ఎల్‌. జి. గార్డెన్‌ లో డిచ్‌పల్లి, దర్పల్లి సర్కిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి అధిక సంఖ్యలో …

Read More »

మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్‌ను

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్దగల అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదని కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం నుండి మార్చాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కెసిఆర్‌కు …

Read More »

వృక్షశాస్త్రంలో శిరీష సోమీనేనీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో శిరీష సోమీనేనీకి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేశారు. అందుకు గాను ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆమెకు ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య డా. అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌ పర్యవేక్షణలో ‘‘స్టడీస్‌ ఆన్‌ ఎపెక్ట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌ లో ఇద్దరికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని పరిశోధక విద్యార్థులు సట్లపల్లి సత్యం, సిహెచ్‌. రమేష్‌ లకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. వారు రూపొందించిన సిద్ధాంత గ్రంథాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల మినీ సెమినార్‌ హాల్‌లో శనివారం ఉదయం ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. మాస్‌ …

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో …

Read More »

భారతరత్న జూనియర్‌ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి…

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న భారతరత్న జూనియర్‌ కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని (ఏ.ఐ.ఎస్‌.బీ) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని మాస్క్‌లు, భౌతిక దూరం, శనిటైజర్‌ ఏమాత్రం పాటించడం లేదని, …

Read More »

టీయూను పరిశోధనా ప్రాంగణంగా తీర్చిదిద్దుతా…

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల సమావేశ మందిరంలో శుక్రవారం రెగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరితో వీసీ ఆచార్య రవీందర్‌ గుప్తా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ నెల 1 వ తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైనందు వల్ల అధ్యాపకులందరితో పాఠ్యప్రణాళికలు, టైం టేబుల్‌, వర్క్‌ లోడ్‌ వంటి …

Read More »

మూడు అంతర్జాతీయ నానో టెక్నాలజీ జర్నల్స్‌లో వీసీ ప్రచురణలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్సిటీలో ప్రపంచ ర్యాంక్‌ పొంది సుప్రసిద్ధ శాస్త్ర వేత్తల్లో ఒకరుగా గుర్తింపు పొందిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మరో మూడు అంతర్జాతీయ పత్రికల్లో మెమరీ డివైసెస్‌, స్పిన్‌ డ్రాన్‌ డివైసెస్‌, డ్రగ్‌ డెలవరి అండ్‌ నానో టెక్నాలజీ మీద విస్తృతమైన ప్రయోగాలు చేసిన పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయని ఒక ప్రకటనలో …

Read More »

ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ …

Read More »

కళాశాలలను సందర్శించిన వీసీ

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని అన్ని కళాశాలలో గల విభాగాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గురువారం సందర్శించారు. ఈ నెల మొదటి తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైన సందర్బంలో అన్ని కళాశాలలను ఆయన పర్యవేక్షించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల, కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల, న్యాయ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »