Education

టీయూలో జాతీయ బాలికల దినోత్సవం

డిచ్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్‌ సెల్‌ ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ సోమవారం సాయంత్రం వర్చువల్‌ వేదికగా ఆన్‌లైన్‌ లో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయ మహిళా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో చాలా మంది విద్యార్థులు చిత్రాలు గీసి ఆన్‌లైన్‌లో ప్రదర్శించారు. అందులో హరిప్రియ, యోగిత, ద్యాగలి సాత్త్విక, …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి

ఆర్మూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ నవనాథ పురం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125 వ జయంతి సందర్భంగా తపస్విని తేజో నిలయంలో పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే తపస్విని తేజో నిలయం నిర్వాహకులైన నరేష్‌కి, నిర్మలకి, స్వరూపకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ కుమార్‌ …

Read More »

మహిళ శక్తి అపారమైంది

డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల శక్తి అపారమైందని, విద్యార్థులందరు తమ జీవితంలో చక్కని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా ఉన్నతమైన విజయాలు సాధించాలని లాభిశెట్టి మహేష్‌ కుమార్‌ అభిలషించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. అపర్ణ వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌ వెబినార్‌ ‘‘శక్తి సామర్థ్యాల అన్వేషణ’’ అనే అంశంపై శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ఇంపాక్ట్‌ …

Read More »

అభ్యుదయానికి పట్టం కట్టిన భండారు అచ్చమాంబ

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి త్రివేణి అన్నారు. బుధవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి …

Read More »

పలువురు అధ్యాపకులకు పాలనా పదవుల బాధ్యతలు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పలువురు అధ్యాపకులు పాలనా పరమైన బాధ్యతలలో నియామకం పొందారు. వైస్‌ చాన్స్‌లర్‌ చాంబర్‌ లో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా మంగళవారం అధ్యాపకులు నియామక పత్రాలను పొందారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. …

Read More »

గుండెపోటుతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో గల మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విభాగంలో గత 13 సంవత్సరాలుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) గా బాధ్యతలు అందిస్తున్న డా. వి. లక్ష్మణ్‌ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. డా. వి. లక్ష్మణ్‌ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య …

Read More »

డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు పి.డి.ఎఫ్‌. సీటు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఎం.బి.ఎ. పూర్వ విద్యార్థి, పూర్వ పరిశోధకుడు డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ ఆఫ్‌ రీసర్చ్‌ (ఐసిఎస్‌ఎస్‌ఆర్‌) సంస్థలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెల్లోగా ప్రవేశం లభించింది. ఎం.బి.ఎ. విభాగపు ప్రొఫెసర్‌ డా. కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో ‘‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌, ఫైనాన్సింగ్‌, డివిడెంట్‌ డిసిషన్‌ ఆన్‌ ద …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా డా. రవీందర్‌ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) కో ఆర్డినేటర్‌గా అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. కె. రవీందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ నియామక ఉత్తర్వును జారీ …

Read More »

ఎం.ఎడ్‌. పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌ కళాశాలకు చెందిన ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగవలసి ఉండగా కోవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదనంతరం ప్రకటిస్తామని ఆమె అన్నారు. కావున ఈ …

Read More »

ఓపెన్‌ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »