Education

సావిత్రిబాయి పూలె విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్‌ డైరెక్టర్‌ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు …

Read More »

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు

బీర్కూర్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని …

Read More »

జీజీ కాలేజీలో మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ గిరిరాజ్‌ కాలేజీలో మౌళిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని పి.డి.ఎస్‌.యు గిరిరాజ్‌ కాలేజీ కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యూ నాయకులు వేణు మాట్లాడుతూ ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ, పీజీ కాలేజీలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. కాలేజీ సమయంలో లైబ్రరీ తెరిచి ఉండటం లేదన్నారు. విద్యార్థులకు …

Read More »

అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను …

Read More »

జనవరి 2న డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో జనవరి 2న డిపార్టుమెంట్‌ ఆఫ్‌ విమెన్‌ డెవలప్‌మెంట్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ పరీక్ష కేంద్రం ఉన్నందున డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 8 నుండి తరగతులు యధావిధిగా నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని …

Read More »

బిఈడి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఈడి ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫలితాలను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 1302 కాగా 1003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రమోట్‌ అయిన వారు 299 మంది విద్యార్థులు. పర్సంటేజ్‌ 77.4 శాతం రాగా బీఈడీ ఫలితాలను తెలంగాణ విద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్తా విడుదల …

Read More »

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

పిట్లం, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని స్కాలర్‌ షిప్‌లు పెంచాలని, గత రెండు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం విద్యార్థుల ఫీజు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండలం ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్‌ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత రెండు …

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వంటపాత్రల వితరణ

వేల్పూర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆర్మూర్‌ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ బోర్డులు, వంటపాత్రలు వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ గవర్నర్‌ కె. ప్రభాకర్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్‌ గవర్నర్‌ రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని …

Read More »

చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి

గాంధారి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మార్చ్‌ ఫాస్ట్‌ ద్వారా కలెక్టర్‌ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానంలో …

Read More »

అర్జున్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో దొండి అర్జున్‌ పరిశోధన చేసిన జానపద సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ సమగ్ర పరిశీలన అనే అంశంపై సోమవారం మౌఖిక పరీక్ష నిర్వహించారు. హుమానిటీస్‌ సెమినార్‌ హాల్‌లో జరిగిన పరీక్షకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్‌ గోనానాయక్‌ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. దొండి అర్జున్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »