Education

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా మొదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల 158 …

Read More »

ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఏమిటి వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్‌), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.వై.ఎల్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్‌, వి.సత్యం, పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, …

Read More »

నేను కలం పట్టాను

నేను కలం పట్టానుకల్లోలిత ప్రాంతాలను శాంత పరచడానికి నేను కాగితాన్ని పట్టానుఅభాగ్యుల కన్నీళ్లను ఒడిసి పట్టడానికి నేను ఒక్కొక్క అక్షరాన్ని ముడి వేసిబాధల ప్రవాహాన్ని బట్టబయలు చేశాను నేను అనగారిన ప్రజల నుదిటి రాతల్నివర్తమానంగా లిఖించాను సిరా చుక్కలను ఒక్కొక్కటి పోగుచేసిబలిసిన దొరల భాగోతాలను ఒక్కొక్కటి బయట పెట్టాను నా ఆలోచనలన్నింటినీ ఒకటిగా కూర్చినిరుద్యోగ యువత నిరాశా నిస్పృహలను పతాక శీర్షికల్లో ఎక్కించాను నేను ఖాళీ సమయాల్ని ఎక్కుపెట్టానుయెదల నిండ …

Read More »

గురుపూర్ణిమ

ఆటవెలది గురువు దేవు డయ్యె గురుపౌర్ణమీరోజుబంధు, మిత్ర, బ్రాత, బ్రహ్మ, విష్ణుహరుని రూపమెత్తి అజ్ఞానమునుబాపుజ్ఞానసుధలు నిచ్చు జ్ఞానరాశి రచయితజె. లక్ష్మీ నర్సయ్యసెల్‌ : 6301761833

Read More »

టీఎస్‌ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

హైదరాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఎంసెట్‌-2021) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.in నుండి ఈ నెల 31 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్‌కు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మాకు 85,828 దరఖాస్తులు వచ్చాయి. కాగా రూ.500 …

Read More »

26న ఛలో కలెక్టరేట్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా కనీసం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని, తాజా రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం టిఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. శనివారం కోటగల్లి ఎన్‌ఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల అన్నింటిని యుద్ధ …

Read More »

టీయూను దర్శించిన అమెరికా రోవన్‌ యూనివర్శిటి కెమిస్ట్రీ ప్రొఫెసర్‌

డిచ్‌పల్లి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వద్యాలయానికి అమెరికా రోవన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం (అజో విభొ కందాళం) ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కందాళం రామానుజాచారి శనివారం ఉదయం విచ్చేశారు. ప్రాణ స్నేహితుడైన ఆచార్య డి. రవీందర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులు కాబడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి విచ్చేసిన …

Read More »

దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌కు 11 మంది హాజరు

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో గురువారం జరిగిందని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. భౌతిక వికలాంగులు ఏడుగురు, ఎన్‌సిసి నలుగురు కలిపి మొత్తం 11 మంది …

Read More »

వాయిదా పడిన డిగ్రీ, బి.ఎడ్‌., పీజీ పరీక్షల రివైస్డ్‌ షెడ్యూల్‌ విడుదల

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలు మరియు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ, బి.ఎడ్‌. పరీక్షలు 22, 23, 24 జూలై 2021 తేదీలలో జరిగే వాటిని వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో …

Read More »

పరీక్షలు వాయిదా…

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 22వ తేదీ గురువారం నుండి ప్రారంభం కావాల్సిన డిగ్రీ 1వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 2వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు వర్షం, వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు పేర్కొన్నారు. 22, 23, 24వ తేదీలలో జరగాల్సిన డిగ్రీ, పిజి, బిఎడ్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలపగా, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »