Education

దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరం (కలెక్టరేట్‌)లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి …

Read More »

సిలబస్‌ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్‌ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్‌ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్‌ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు బాలుర పాత మరియు కొత్త వసతి గృహాలను చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వార్డెన్‌ డాక్టర్‌ గంగా కిషన్‌, డాక్టర్‌ కిరణ్‌ రాథోడ్‌ కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రెండు వసతిగృహంలోని విద్యార్థులను మెస్‌ …

Read More »

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు దీనిని ఇంటర్‌ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్‌ …

Read More »

శాస్త్ర సాంకేతికతకు సాంఖ్యాక శాస్త్రమే మూలాధారం

డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ మరియు తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక్కరోజు అవగాహన సదస్సు అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించారు. సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ -ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, స్టాటిష్టిక్స్‌ అనుకరణ మరియు ప్రాముఖ్యతను గురించి వివరించారు. …

Read More »

యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌, సౌత్‌ మరియు బిఈడి క్యాంపస్‌ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్‌.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్‌ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్‌.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌, డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. …

Read More »

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తా సమీపంలోని ఎస్‌.సి.బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ, వసతి గృహంలో కల్పిస్తున్న భోజన వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజూ చేస్తున్న దినచర్య, బోధన, …

Read More »

పదవ తరగతి అయిన తరువాత ఏం చేస్తారు…?

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత భవిష్యత్తులో అవసరానికి అనువైన విద్యను అభ్యసించాలి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున మద్నూర్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ ను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం పదవతరగతి విద్యను అభ్యసిస్తున్న తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులు చదువుతున్న పుస్తకాలను అడిగి …

Read More »

బిచ్కుందలో ఐటిఐ ప్రారంభం…

బిచ్కుంద, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఐ.టీ. ఐ. / అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ బిచ్కుందలో ఈ సంవత్సరం నుండి కొత్తగా ప్రారంభిస్తున్న ఆరు ట్రేడ్‌ లలో అడ్మిషన్‌ ల భర్తీ అన్ని శాఖల సహకారంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున బిచ్కుంద మండలంలోని ప్రభుత్వ ఐ టి. ఐ. లో నిర్వహిస్తున్న అడ్మిషన్ల ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. …

Read More »

డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, రంగోలి పోటీలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »