కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను …
Read More »న్యాక్ గుర్తింపు కొరకు సిద్ధం కావాలి
డిచ్‌పల్లి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్ అక్రిడియేషన్ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య టీ యాదగిరిరావు పేర్కొన్నారు. గురువారం పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ హల్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, …
Read More »మెయిన్ క్యాంపస్‌ను సందర్శించిన విసి
డిచ్‌పల్లి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్‌లో గురువారం వైస్ ఛాన్స్లర్ ఆచార్య.టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలలో తరగతి గదులలో బోధనా జరుగుచున్న తీరును పర్యవేక్షించినారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరుచుకోవాలని విభాగాధిపతులకు సూచించారు. అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని అనుమతితో మాత్రమే సెలవులను వాడుకోవాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం …
Read More »తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆచార్య. టి. యాదగిరిరావు మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని అందుకే అత్యంత పారదర్శకంగా విద్యా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్యులను మాత్రమే …
Read More »తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్ గుర్తింపునకు కృషి చేస్తా…
డిచ్‌పల్లి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్స్లర్‌గా సీనియర్ ప్రొఫెసర్ .టి .యాదగిరి రావు సోమవారం పరిపాలనా భవనం వైస్ -ఛాన్స్లర్ ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, కంట్రోలర్, ఆడి సెల్ డైరెక్టర్, డీన్స్, హెడ్స్, చైర్మన్ బిఓఎస్‌ల తొ పాటుగా టీచింగ్ నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ …
Read More »మీ పిల్లలు కాలేజీకి వెళుతున్నారా… లేదా… తెలుసుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ రోజు కళాశాలకు హాజరై విద్యాబుద్దులు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు కళాశాలకు రావాలని, అటెండెన్స్ ప్రతీ రోజూ …
Read More »పాఠశాల స్థాయినుంచే అవగాహన కల్పించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్‌కు అవగాహన, క్విజ్ పోటీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడంతో పాటు, తోటీ …
Read More »గ్రూప్స్ పరీక్ష నిర్వహణకు సన్నద్దం కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలలో గ్రూప్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నవంబర్ 17, …
Read More »ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు
బాన్సువాడ, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల శుక్రవారం ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …
Read More »గ్రంథాలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా …
Read More »