నందిపేట్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో ఆదివారం స్వచ్ఛతాహి సేవ కారిక్రమాలు జరిగాయి. ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు విద్యుత్ ఉప కేంద్రం, స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్, కేదారేశ్వర ఆశ్రమం వరకు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి శ్రమదానం నిర్వహించి ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు తొలగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, ఎన్ …
Read More »గోమాత సేవలో తరించిన క్షత్రియ విద్యార్థులు
ఆర్మూర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల, చేపూర్ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ నిర్వహించారు. వేదికపైన స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న పాండే ఉన్నారు. గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి …
Read More »ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, …
Read More »ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్ కోసం ఇప్పటి నుండే ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రిపుల్ ఐటీల్లో సీటు సాధించే దిశగా విద్యార్థులకు విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున బిక్నూర్ కే.జి.బి.వి. పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక అధికారిణి హరిప్రియ ను అడిగి తెలుసుకున్నారు. వంటశాల, స్టోర్ రూం …
Read More »డిజిటల్ తరగతులు నిర్వహణకు పరికరాలు అందించిన పూర్వ విద్యార్థులు
బాన్సువాడ, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చేయూతనందించేందుకు ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980, 1982 బ్యాచ్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు బాన్సువాడ పట్టణంలోని కొన బాన్సువాడ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ చౌదరి ఆధ్వర్యంలో పాఠశాలకు డిజిటల్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను …
Read More »ఆచార్యులకు మార్గ నిర్దేశం చేసిన పక్కి శ్రీనివాస్
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ఆధార భూత కేంద్రీయ విషయాల వర్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు విభాగ్ వ్యవస్థ ప్రముఖీ శ్రీనివాస్ పాల్గొని శిశుమందిర్ పాఠశాల ఆచార్యులకు మాతాజీలకు మార్గం నిర్దేశించేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నాగులమ్మ వెంకన్న గుప్తా, కార్యదర్శి సిర్న దత్తు, జిల్లా …
Read More »బి.ఎడ్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభం
సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల గురువారం ప్రారంభమైనాయి. గురువారం ప్రారంభమైన పరీక్షకు 1312 విద్యార్థులకు గాను 1258 మంది హాజరైనారు. 54 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Read More »సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల పనితీరు మెరుగుపడేలా సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. విద్యా వ్యవస్థను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని …
Read More »బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సత్కారం
బాన్సువాడ, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను బుధవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ సహజమని, ఎక్కడ విధులు నిర్వహించిన మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, …
Read More »విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని కేటాయించండి
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల పాత విద్యాశాఖ కార్యాలయ స్ధలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ రాష్ట్ర మాజీమంత్రి, బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజెందర్ రెడ్డి,బార్ ఉపాధ్యక్షుడు రాజు, …
Read More »