హైదరాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఫొటో, సంతకం, పేరు, మీడియంతో పాటు ఏయే సబ్జెక్టులు రాస్తున్నామో వాటిని గమనించాలని, …
Read More »బడులు ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా గల ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని, బడులు పునః ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునేందుకు మరో 20 రోజుల వ్యవధి …
Read More »డిగ్రీ పరీక్షలకు సర్వం సిద్దం
డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు. ఆయా కళాశాల పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించే వారు పేపర్ డౌన్‌లోడ్ చేసే సమయానికి విధిగా పరీక్ష కేంద్రంలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్‌లకు అనివార్యమైన, అత్యవసర పనుల ఏమైనాఉంటే విధిగా అక్కడ పనిచేస్తున్న మరోఅధికారికి లిఖిత పూర్వకంగా …
Read More »కులమత రహిత సమాజం నిర్మించేది విద్యార్థియే
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల ఫేర్ వెల్ డే కార్యక్రమం అంగరంగా వైభవంగ న్యూ అంబేద్కర్ భవన్ ఆడిటోరియంలో జరిగింది. కళాశాల మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి సంవత్సరం విద్యార్థుల కొరకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. నగరంలోని ప్రముఖ నృత్య దర్శకులు వినయ్ విద్యార్థులచే అద్భుతమైన నృత్యాలు చేయించారు. అదేవిధంగా ప్రముఖ కూచిపూడి …
Read More »ఎస్‌సి బాల బాలికల నుండి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం క్రింద 1 వ తరగతిలో డే స్కాలర్ ఇంగ్లిష్ మీడియ నందు, 5 వ తరగతిలో రెసిడెన్షియల్ గా ఇంగ్లిష్ మీడియం నందు ప్రవేశం కోరం అర్హులైన ఎస్సి బాల, బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి కులాల అభివృద్ధి అధికారి రజిత గురువారం …
Read More »ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం….
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో 2024 సంవత్సరానికి సంబందించిన టిపిటిఎఫ్ కాలమనిని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద, నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని ప్రభుత్వం పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సర్వీస్ పర్సన్స్‌ను నియమించి, …
Read More »ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉపాధ్యాయుడికి ఫైనల్ షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గాప్రసాద్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే అబ్దుల్ ఖయ్యూం అనే ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. సదరు …
Read More »ఘనంగా గణిత దినోత్సవం
బాన్సువాడ, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని గుణ బాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గణిత పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోడల్స్ ప్రదర్శన, ప్రాజెక్ట్ వర్క్, క్విజ్ పోటీలు,రిడిల్స్, పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో …
Read More »‘పది’ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. ప్రతి విద్యార్థికి అర్ధమయ్యే రీతిలో, వారు ఆకళింపు చేసుకునేలా నాణ్యమైన బోధన అందించాలని అన్నారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, ఉన్నతి లక్ష్య, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో …
Read More »కళాశాల భూములు కాపాడండి…
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భూములను కబ్జా చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. శిశు మందిర్ యాజమాన్యం 2018 ఫిబ్రవరిలో రెండు ఎకరాల తప్పుడు లీజు …
Read More »