Education

అగ్రికల్చర్‌ కోర్స్‌పై విద్యార్థులకు అవగాహన

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డిలో నూతనంగా తీసుకువచ్చిన బిఎస్సి అగ్రికల్చర్‌ కోర్స్‌పై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ నుంచి జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్ర సింగ్‌ ముఖ్యఅతిధిగా విచ్చేసి కోర్స్‌ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అగ్రికల్చర్‌ బీఎస్సీ యొక్క అవశ్యకతను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్‌ ప్రవేశపెట్టిన ఈ మూడు సంవత్సరాల బిఎస్సి అగ్రికల్చర్‌ …

Read More »

కామారెడ్డిలో చదివి… డిప్యూటి కలెక్టర్‌గా ఎదిగి…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో 1వ తరగతి నుండి 10 తరగతి వరకు సిఎస్‌ఐ స్కూల్‌ చదివి హైదరాబాదులో మైనారిటీ వెల్ఫేర్‌ డిప్యూటీ కలెక్టర్‌ గా పదోన్నతుల పొందిన కె వీణని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ వేల్పర్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె వీణ మాట్లాడారు. కామారెడ్డి …

Read More »

స్టూడెంట్‌ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టూడెంట్‌ మ్యానిఫెస్టోను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల న్యూస్‌ సెమినార్‌ హాల్లో ఏబివిపి ఆధ్వర్యంలో స్టూడెంట్‌ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థిని ఉద్యోగం అంశాలను చేర్చారు. …

Read More »

భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్‌ అన్నారు. స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాల వేడుకలను నిర్వహించారు. వేడుకలను విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్‌ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి బతుకమ్మను నరాల స్వప్న సుధాకర్‌ నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం మహిళల …

Read More »

నిరుద్యోగులను విస్మరించిన బిఆర్‌ఎస్‌ మేనిఫెస్టో…

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగులను విస్మరించిందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు ఆరోపించారు. ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి నమ్మకాన్ని తెలంగాణ నిరుద్యోగులకు కల్పించలేకపోయారని ఇలాంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకుంటే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ …

Read More »

విజయ్‌ హైస్కూలో బతుకమ్మ సంబురాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ విజయ్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో బతుకమ్మ పండగ సంబురాలను నిర్వహించారు. విజయ్‌ హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కవితా దివాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా జరుపుకోగల బతుకమ్మ పండగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అనీ, ఆ పండుగని తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా, తొమ్మిది రోజుల పాటు ఆడుతూ పాడుతూ … గౌరి దేవిని అత్యంత …

Read More »

ఆల్ఫోర్స్‌ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆల్‌ ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌ రెడ్డి హాజరయ్యారు. చిట్టి బతుకమ్మ ఉత్సవ వేడుకలో భాగంగా శాస్త్రోపేతంగా పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులలో విద్యార్థినిలు పాఠశాలకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన …

Read More »

టియు సివోఇ పదవీకాలం పొడగింపు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ఆచార్య ఎం అరుణకి పరీక్షల నియంత్రణ అధికారి పదవీకాలం పొడిగిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపారు. ఆచార్య ఎం అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టుకొని పరీక్షల నియంత్రణ అధికారినిగా పదవీకాలం పొడిగించడం పట్ల తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ …

Read More »

అల్పాహారం బాగుంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం అల్పాహారం ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి, రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్‌ కే. రవి కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు. మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన …

Read More »

టియు సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ సుధాకర్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ సుధాకర్‌ గౌడ్‌ను నియమించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్సలర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపల్‌గా డా.ఆర్‌.సుధాకర్‌ గౌడ్‌ని నియమించారు. ఇటీవలే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన డా. ఆర్‌.సుధాకర్‌ గౌడ్‌ గతంలో మూడు సార్లు ప్రిన్సిపల్‌గా, క్రీడల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »