బీర్కూర్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన కీర్తి రాజ్ నిరూపించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళితే పేదరికం అడ్డు రాదని నిరూపించి మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగాన్ని సాధించారు కీర్తి రాజ్. ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగుల కోసం పరీక్షలు నిర్వహించగా ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే …
Read More »ఈ సంవత్సరం ఆకస్మిక తనిఖీలుంటాయి
డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రధాన ఆచార్యుల సమావేశానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య. ఎం. యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలో అన్ని విద్యాసంస్థలలో అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. కోవిడ్ కాలంలో విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అత్యంత క్రమశిక్షణతో నిర్వహించే తరగతి గది ప్రధాన …
Read More »సీబీఆర్టీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీ కోసం నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి సూచించారు. సీబీఆర్టీ పరీక్షలను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమన్వయ …
Read More »పరీక్ష అట్టలు,పెన్నుల వితరణ
ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలములోని కోమన్ పల్లి ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఆర్మూర్ కు చెందిన ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అనిల్ పడాల్ 86 పరీక్ష అట్టలు,పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదవకుండా ఇష్టంతో చదువాలని అలాగే దంత పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.అనంతరం డాక్టర్ అనిల్ పడాల్‌ని గ్రామ సర్పంచ్ నీరడి రాజేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు …
Read More »నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి
హైదరాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …
Read More »హైకోర్టు జడ్జిలను కలిసిన న్యాయవాద బృందం
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై,హైకోర్టు జడ్జిలుగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కె. సుజన, లక్ష్మి నారాయణ లను నిజామాబాద్ న్యాయవాదుల బృందం సోమవారం హైకోర్టు ప్రాంగణంలోని వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్ఛం, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామ వాస్తవ్యుడు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా …
Read More »ఆగష్టు 3 వరకు పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బిఈడి 4వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1,2, 3,4వ సెమిస్టర్ (2019, 2020, 2021, 2022 బ్యాచ్‌ల) బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3వ తేదీ వరకు గడవు ఉందని, 4వ తేదీ వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ …
Read More »దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం
డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంపై జాతీయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ అభివృద్ధిలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కీలకమని పేర్కొన్నారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి నూతన వినూతన ఆవిష్కరణలు ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. దానికి యువ …
Read More »కేర్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం 26వ తేదీ కేర్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ వారు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిఐసిఐలో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాల కొరకు కేర్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసారని తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై, 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 10 గంటల నుండి …
Read More »ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా మధ్యంతర భృతిని త్వరగా ప్రకటించి అనుకూలమైన పిఆర్సి అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనేకర్ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ మండలంలో నిరసన తెలియజేసి తహాసిల్దార్‌కు …
Read More »