నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31న హరిదా రచయితల సంఘం నిర్వహించనున్న సాహిత్య మహాసభ విజయవంతం కావాలని శాసనమండలి సభ్యులు, భారత్ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ …
Read More »ప్రాక్టీకల్స్ వాయిదా
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22వ తేదీ నుండి 30 మే వరకు జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప్రాక్టీకల్ పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని, జూన్ 1వ తేదీ నుండి 7 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆయా యుజి కళాశాలల ప్రిన్సిపాల్స్, …
Read More »మే 10 నుండి సెలవులు ఇవ్వండి
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి మే 31 వరకు వేసవిసెలవులు ప్రకటించాలని టీజీ సిటిఏ, టీజీ జిసిటిఏ, సంఘాల అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్త్రార్ ప్రొఫెసర్ యాదగిరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరీక్షల ఎవల్యూషన్ రెమ్యూనరేషన్ కూడా పెంచాలని, ఎన్సిసి సబ్జెక్టును ఎలక్టివ్‌గా అమలుపరచాలని, పరీక్షల …
Read More »ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. రెండవ సంవత్సరం మొత్తం 14,086 మంది విద్యార్థులకు గాను 8,561 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,391 …
Read More »ఏ.ఈ.ఈ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్ జిల్లాలో మూడు సెంటర్ లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, …
Read More »సీబీఆర్టీ (ఏఈఈ) రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖల్లో సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏ.ఈ.ఈ) పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు సంబంధిత …
Read More »టియు రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నిర్మలా దేవి
డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో గత 23 సంవత్సరాల బోధన అనుభవం గల ప్రొఫెసర్ నిర్మల దేవిని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్‌గా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియమించారు. బుధవారం సాయంత్రం ప్రొఫెసర్ నిర్మల దేవి రిజిస్టర్, తెలంగాణ యూనివర్సిటీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ నిర్మలాదేవికి పరిశోధనలో, పరిపాలనలో …
Read More »మన్ కీ బాత్ వంద పుస్తకాలతో సమానం
నిజామాబాద్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన్ కీ బాత్ 100 ఎపిసోడ్స్ 100 పుస్తకాలతో సమానమని, ఈ 100 ఎపిసోడ్స్‌లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. 100 ఎపిసోడ్స్‌లో ఎన్నో గొప్ప విషయాలను, …
Read More »కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం
నిజామాబాద్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ప్రవీణ్ కుమార్ వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూటుమెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా మొత్తం అభ్యర్థులు 5,285 మంది రాత పరీక్షకు …
Read More »పనులు నాణ్యతగా జరిగేలా చూడాలి
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31 లోపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్య ,సంక్షేమ, మౌలిక వసతుల సమస్త చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కింద చేపడుతున్న పాఠశాల భవనాల పురోగతిపై …
Read More »