Education

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు తెలంగాణ యూనివర్సిటీ సిఓఈ ప్రొఫెసర్‌ అరుణ సోమవారం తెలిపారు. 5వ సెమిస్టర్‌ పరీక్షల్లో 9 వేల 638 విద్యార్థులు పరీక్ష రాయగా 3 వేల 788 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 2 …

Read More »

విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యార్థులు తల్లితండ్రులకు బహుమతులు అందజేశారు. శ్రీ చైతన్య ప్రిన్సిపాల్‌ స్వర్ణలత మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కుటుంబం తల్లిదండ్రుల విలువలు మానవ సంబంధాలు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం …

Read More »

నిబంధనల అమలుపై నిశిత పరిశీలన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్‌ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే …

Read More »

పది పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

Read More »

మెడికల్‌ కళాశాలను సందర్శించిన జెడ్పి చైర్మన్‌, కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను శనివారం సాయంత్రం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. మెడికల్‌ కళాశాలలో అందుబాటులో ఉన్న వసతి, సదుపాయాలను పరిశీలించారు. కళాశాల నిర్వహణ తీరు గురించి ప్రిన్సిపాల్‌ ఇందిరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న …

Read More »

పరీక్ష అట్టలు పంపిణీ చేసిన సర్పంచ్‌

రెంజల్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం) లో అనాధ, పేద విద్యార్థులకు పరీక్ష అట్టలు, నోటుబుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, కంపాక్స్‌ బాక్సులను స్థానిక సర్పంచ్‌ ఖలీంబేగ్‌ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ ముఖీంబేగ్‌ తన సొంత ఖర్చులతో పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆరో తరగతి నుండి పదవ …

Read More »

పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్‌ థియరీ పరీక్షలు ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉండగా అనివార్య కారణాలతో పరీక్షలు వాయిదా వేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ప్రొఫెసర్‌ ఎం.అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్హులైన బీఈడీ మొదటి సెమిస్టర్‌ విద్యార్థులు ఈ విషయం గమనించాలని …

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన వైస్‌ చాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ని శనివారం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాయ్స్‌ హాస్టల్‌లోని వంటశాల, స్టోర్‌ రూమ్‌, విద్యార్థుల గదులను పరిశీలిస్తూ కలియతిరిగారు. వంటశాలలో అపరిశుభ్రత ఉండటంపై వైస్‌ ఛాన్స్‌లర్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైనింగ్‌ హాల్‌లో మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అక్కడే …

Read More »

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్‌. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. మే …

Read More »

మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సనత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని మెడికల్‌ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డిఎంహెచ్‌ఓ, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »