Education

నేటి విద్యార్థే రేపటి భావితరాలకు మార్గదర్శకులు

రెంజల్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్‌ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్‌ సేవ సంస్థ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్‌ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

ఆర్మూర్‌లో విద్యార్థుల స్వచ్చత కార్యక్రమం

డిచ్‌పల్లి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌ సూచనల మేరకు, స్వచ్ఛ యాక్షన్‌ ప్లాన్‌ 2022-23 పథకంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆర్మూర్‌ బస్టాండ్‌లో నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌, సిద్ధార్థ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు …

Read More »

పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

బాన్సువాడ, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్‌ మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ జిల్లా కలెక్టర్‌ కు …

Read More »

ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఖలీల్‌ వాడిలో గల ఎస్‌.ఎస్‌.ఆర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్‌ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …

Read More »

కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నిజామాబాద్‌ రూరల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్‌ తేజ్‌ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …

Read More »

గ్రూప్‌ 4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌ సంస్థ ఫౌండర్‌ చంచల్‌ గూడ ఎస్పీ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ సహకారంతో గ్రూప్‌ 4 ఎగ్జామ్‌ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ సర్పంచ్‌ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పంపిణి చేశారు. ఈ …

Read More »

నివేదికల ఆధారంగా చట్టంలో సంస్కరణలు తీసుకొస్తాం

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ కె తిరుమల్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్స్‌, అంగన్వాడీ టీచర్స్‌, ప్రాంగణ ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. …

Read More »

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

బాన్సువాడ, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కళాశాలలో ఆంగ్లం బోధనలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందూరు గంగాధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పిజిలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలని, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. అలాగే నెట్‌, సెట్‌, పిహెచ్‌డి …

Read More »

గెస్ట్‌ లెక్చరర్‌ కొరకు దరఖాస్తు చేసుకోండి

మోర్తాడ్‌ మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కామర్స్‌ సబ్జెక్టులో బోధించుటకు గెస్ట్‌ లెక్చరర్‌ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పెద్దన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్‌, సెట్‌, పిహెచ్‌డి కలిగి బోధన అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదని …

Read More »

బాలసాహిత్య సృజనలో మేటి కాసర్ల

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సాహిత్యం రంగంలో గత ముప్పయేళ్ళుగా సేవలు అందిస్తున్న డా.కాసర్ల అభినందనీయులని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా.వి. త్రివేణి అన్నారు. శనివారం ఇందూరుయువత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో, సంస్ఠ కార్యాలయంలో డా.కాసర్ల నరేశ్‌ రావు రచించిన ‘‘జై విజ్ఞాన్‌ ‘‘ పుస్తక పరిచయ సభ విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా వచ్చిన డా.త్రివేణి మాట్లాడుతూ ‘తెలంగాణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »