Education

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మోడల్‌ స్కూల్‌, సంక్షేమ స్కూల్స్‌ ప్రిన్సిపల్స్‌, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌లతో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, పక్కా …

Read More »

జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రశ్నించే పీ.డీ.ఎస్‌.యూ. (పిడిఎస్‌యు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌,డాక్టర్‌ కర్క గణేష్‌,జిల్లా కోశాధికారి నిఖిల్‌, సిపిఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ ఆర్మూర్‌ ఏరియా సబ్‌ డివిజన్‌ కార్యదర్శి కిషన్‌ లను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పి.వై.ఎల్‌.నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ, …

Read More »

రాబోవు పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రతి రోజు ఉదయం …

Read More »

టియు పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కే సంపత్‌ కుమార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య. కే.సంపత్‌ కుమార్‌ని నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ఆచార్య కే సంపత్‌ కుమార్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌లో ఆచార్యులుగా కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో అప్లైడ్‌ స్టాటిసిక్స్‌ హెడ్‌గా, బోర్డ్‌ …

Read More »

టియు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాలను నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రవీణ్‌ గతంలో బయోటెక్నాలజీ విభాగాతిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్‌ …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్‌, టాయిలెట్స్‌, విద్యుత్‌ సరఫరా, నీటి …

Read More »

ఎన్‌ .ఎస్‌ .ఆర్‌ ఇంపల్స్‌ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ ఇంపల్స్‌ విద్యాసంస్థలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు మాతృభాష తెలుగు సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆశిష్‌్‌, ప్రిన్సిపల్‌ శిరీష, ఏ.వో రాజ ప్రదీప్‌, తెలుగు భాష ఉపాధ్యాయులు కమల్‌ మాట్లాడుతూ అమ్మ ప్రేమలా …

Read More »

జ్యోతిబా ఫూలే హాస్టల్లో రాత్రి బస చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్‌ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌ ను అడిగి …

Read More »

విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూరులో విద్యార్థులకు పౌష్టికాహారం- ప్రాధాన్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎస్‌. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ ఫిర్దోజ్‌ ఫాతిమా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువగా నీరు తాగాలని, …

Read More »

త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో త్రాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతీరోజూ నిరంతర నీటి సరఫరా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »