Education

దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఉన్న దివ్యాంగుల పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించే బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు విద్యను బోధించే తీరు బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్‌ రావు, సర్పంచ్‌ వికార్‌ పాషా, ఉపాధ్యాయులు విశ్వనాథన్‌, మహాజన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

కస్తూర్బా గాంధీ పాఠశాలలు సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ సందర్శించారు. పలు రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్‌ రావు, పాఠశాల ప్రత్యేకాధికారి శ్యామల, ఉపాధ్యాయురాలు …

Read More »

మన ఊరు- మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన మన ఊరు- మనబడి కార్యక్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని మొదటి విడతలో ఎంపికైన వీరన్న గుట్ట,సాటాపూర్‌, నీలా, బోర్గం పాఠశాలలను మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మండల ప్రత్యేక అధికారి రాములతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలల్లో చేపడుతున్న భవనాల …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారని …

Read More »

విద్యార్థి దశ నుండే భవిష్యత్‌ నిర్దేశించుకోవాలి

బోధన్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి భవిష్యత్‌ ను నిర్దేశించుకోవాలని బోధన్‌ ఎమ్మెల్యే షెకిల్‌ ఆమెర్‌ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నిక్కత్‌ కౌసర్‌ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షకీల్‌, జిల్లా విద్యాధికారి లోకం రఘురాజ్‌, ధర్పల్లి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రఫీ యుద్దీన్‌, హాజరయ్యారు. …

Read More »

శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్‌ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్‌ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ …

Read More »

కామారెడ్డిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వివేకానంద బీట్‌ ఆఫర్స్‌ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక అంశాలపై సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు 48 అంశాలపై వివిధ రూపాలను ప్రదర్శించారు. భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాలపై నిజరూపకలు తయారు చేసి వాటి గురించి వివరంగా సందర్శకులకు …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి నాలుగవ తేదీన ‘‘నైతికత – మానవ విలువలు’’, ఆరవ తేదీన ‘‘పర్యావరణ విద్య’’ పరీక్షలు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని 116 జూనియర్‌ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లు పరీక్షలకు అన్ని …

Read More »

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం

ఎడపల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలోని ఆయా గ్రామాల్లో ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. సర్‌ సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28 న రామన్‌ ఎఫెక్ట్‌ కనుగొనడంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిందని పలువు హెడ్మాస్టర్‌లు తెలిపారు. …

Read More »

11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

నందిపేట్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఖుదావంద్‌ పూర్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1976-77 నుండి 1986- 87 వరకు 11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 236 మందికి గాను 180 మంది ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాల ఆవరణకు చేరుకుని ముందుగా సరస్వతీ మాతకు పూజా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »