నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాల్ లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ లతో సమావేశం …
Read More »నవోదయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయం వచ్చే విద్యా సంవత్సరానికి 9 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఎంట్రెన్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »పోలింగ్ కేంద్రాలలో వసతులను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీంగల్, వేల్పూర్, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో …
Read More »శిథిలమైన భవనాల్లో అంగన్‌వాడిలు నడపకూడదు
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్ర పర్యటనలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీడీపీఓలు, సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రాల్లో పారిశుధ్యం, …
Read More »రిటైర్మెంట్ వయసు పెంపు సరికాదు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల …
Read More »అందరు కలిశారు.. నీటి కష్టాలు తీర్చారు…
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే రోజున పాఠశాలలో నీటి సమస్య ఉందని గ్రామస్తులకు తెలుపగా గ్రామ పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో బోర్ వేయించారు. కాగా శుక్రవారం స్థానిక మాజీ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ తన స్వంత ఖర్చులతో మోటార్ ఇప్పించి ఫిట్టింగ్ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సమస్య తీర్చి బోర్ …
Read More »పిహెచ్‌సి, పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పీ హెచ్ సిలోని …
Read More »విఆర్ కె విద్యార్థులకు స్పీకింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ సెషన్
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వి ఆర్ కే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించడానికి ఇంగ్లీషులో జస్ట్ ఎమినిట్ జామ్ రౌండు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేసి సమర్థవంతంగా మాట్లాడేలా విషయం పైన అవగాహన కలిగించారు. అనంతరం ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా …
Read More »పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఎడ్ రెండవ సంవత్సరపు మూడో సెమిస్టర్ ( రెగ్యులర్) చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు ఫిబ్రవరి 8వ తేదీ వరకు చెల్లించ వచ్చునని, 100 రూపాయల పరాధ రుసుముతో 10వ తేదీ వరకు చెల్లించ వచ్చునని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ …
Read More »నిరంతర సాధనయే విజయానికి కారణం…
బాన్సువాడ, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి విద్యార్థి నిరంతర సాధన దిశగా కృషి చేసినట్లయితే విజయాలు తమ దరికి చేరుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు నక్క నవీన్ అన్నారు. బుధవారం సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పాటు …
Read More »