నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ శానిటైజర్ బాటిల్ తోపాటు అవసరమైతే మంచినీటి బాటిల్ కూడా …
Read More »టీయూను సందర్శించిన యూకే బిపిపి యూనివర్సిటీ అధికారులు
డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్రిటన్ (యూకే) లోని బిపిపి యునివర్సిటీ అధికారులు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ వారికి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చారు. యూకేలోని అతి పెద్ద స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రతిష్ఠాత్మకమైన బిపిపి యూనివర్సిటీ అధికారులు తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఎంఒయు కుదుర్చుకొనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయాన్ని …
Read More »టీయూలో 210 మందికి బూస్టర్ డోస్
డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుక్రవారం ఉదయం బూస్టర్ డోస్ టీకా క్యాంప్‌ను ఏర్పాటు చేశామని చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి తెలిపారు. మొత్తం 210 మందికి బూస్టర్ డోస్ టీకాలు వేశారని అన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ …
Read More »సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు 13 మంది హాజరు
డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్ వేరిఫికేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మొత్తం 13 మంది హాజరైనట్లు దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం నేషనల్ సర్వీస్ క్యాడెట్ (ఎన్‌సిసి) 11 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక …
Read More »తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలివితేటలు ఏ ఒక్కరికో సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన …
Read More »ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జరిగిన కామారెడ్డి జోన్ సమావేశంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసము ఉపాధ్యాయులు కదిలి రావాలని, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపు నిచ్చారు. వారు మాట్లాడుతూ పాఠశాలల్లో 19 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా …
Read More »లైబ్రరీకి పుస్తకాలు అందజేసిన మంత్రి
డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (జనరల్ లైబ్రరీ) కి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గ శాసన సభాసభ్యులు మరియు రోడ్లు, భవన నిర్మాణాలు, శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తరఫున తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు పోటీ పరీక్షల పుస్తకాలను వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న 90 వేల …
Read More »మరో ముగ్గురికి కరోనా పాజిటివ్
డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించామని చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి తెలిపారు. 65 మంది విద్యార్థులకు టెస్ట్ చేయగా ముగ్గురు విద్యార్థులకు పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇది వరకే 17 మందికి పాజిటీవ్ రాగా అందులో ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, …
Read More »సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఈసారి వర్షాకాలంలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున అందుకు అనుగుణంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ జూనియర్ …
Read More »సి.ఎస్.,డి.వో.లు చాకచక్యంగా వ్యవహరించాలి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్థూ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ అన్నారు. గురువారం ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి …
Read More »