Education

28, 29 తేదీల్లో సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28, 29 తేదీలలో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. 28 వ తేదీన భౌతిక వికలాంగులు, సిఎపి (క్యాప్‌)బీ 29 వ తేదీన నేషనల్‌ సర్వీస్‌ …

Read More »

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల అవగాహన సదస్సు హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ …

Read More »

ఆగస్ట్‌ 10 వరకు పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ (థియరీ, ప్రాక్టికల్‌) రెగ్యూలర్‌ మరియు బ్యాక్‌ లాగ్‌ పరీక్షల ఫీజు గడువు ఆగస్ట్‌ 10 వ తేదీ వరకు ఉందని …

Read More »

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెల ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలనిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ శనివారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు …

Read More »

26 నుండి ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్‌ పరీక్షలు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జనరల్‌ మరియు ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి …

Read More »

పరస్పర ఆలోచనలతోనే సమర్థవంతమైన పరిశోధనలు

హైదరాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించడానికి జన్యుశాస్త్రంలోని వివిధ విభాగాలతో వినూత్న రీతిలో సమీకృత పరిశోధనలు జరపాలని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ డి. శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సమీకృత జీవశాస్త్రం అనువర్తిత జన్యుశాస్త్రం’’ పై ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియంలో మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. …

Read More »

టీయూలో ఘనంగా జాతీయ సిపిఆర్‌ దినోత్సవం

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం మరియు ఇందూరు అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సిపిఆర్‌ (కార్డియో పల్ననరీ రీ సస్టేషన్‌) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీశైలం మాట్లాడుతూ అన్నింటిల్లో కెల్లా ప్రాణాలను కాపాడడమే ఉత్తమమని అన్నారు. ఆపద సమయంలో తోటివారిని ఎలా కాపాడవచ్చో …

Read More »

డిచ్‌పల్లిలో బంద్‌ విజయవంతం

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్‌ పిలుపు మేరకు బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో పాఠశాలలు కళాశాల తరగతులు బహిష్కరించి బంద్‌ చేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు డివిజన్‌ అధ్యక్షుడు అరుణ్‌, పివైఎల్‌ జిల్లా కార్యదర్శి సాయినాథ్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న …

Read More »

పీజీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షల రీ-షెడ్యూల్‌ విడుదల

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సెమిస్టర్స్‌ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 13 నుంచి నిర్వహించనుండగా అధిక వర్షాల ప్రభావంతో సెలవుల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయని, అవి తిరిగి ఆగస్ట్‌ 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …

Read More »

డిగ్రీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షల రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. మొదటి, రెండవ, మూడవ సంవత్సరం వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడిన సంగతి విదితమే. కాగా ఈ పరీక్షల సమాధాన పత్రాలకు ఈ నెల 26 వ తేదీన రీవాల్యూయేషన్‌ / రీకౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »