Education

అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్‌, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్‌సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్‌, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, …

Read More »

నారాయణ కళాశాలకు గుర్తింపు లేదు

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణంలోని ఆర్యనగర్‌లో నారాయణ జూనియర్‌ కాలేజ్‌ (కార్పొరేట్‌) పేరిట ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ కళాశాలకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ నుంచి ఇంతవరకూ ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ గురువారం స్పష్టం చేశారు. నారాయణ కాలేజ్‌ (కార్పొరేట్‌) పేరిట ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అపోహలకు గురిచేస్తూ …

Read More »

విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్‌ అధికారులతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన ఊరు- మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

మన ఊరు – మన బడి అమలులో నిజామాబాదు జిల్లా ఆదర్శం

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలులో నిజామాబాద్‌ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక …

Read More »

ప్రణాళిక బద్దంగా చదివితే ఐఏఎస్‌ సాధించడం సులువే

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే సివిల్స్‌ సాధించడం సులభమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం గ్రూప్స్‌, సివిల్స్‌ సిలబస్‌పై జిల్లా కలెక్టర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఇష్టపడి ఐఏఎస్‌ సాధించిన వివరాలను తెలిపారు. …

Read More »

తెలుగులో రమేష్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థి భానోత్‌ రమేష్‌ పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా (మౌఖిక పరీక్ష) మనగళవారం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విశ్రాంతాచార్యులు ఆచార్య ననుమాస స్వామి పర్యవేక్షణలో పరిశోధకులు ‘‘తెలంగాణ ఆధునిక నవలలు – మానవ విలువలు – ఒక పరిశీలన (1990-2010) అనే అంశంపై సిద్ధాంత గ్రంథం …

Read More »

పకడ్బందీగా టెట్‌ నిర్వహణ

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరిక్ష – 2022 (టిఎస్‌ టెట్‌) పరీక్షని ఈనెల 12 ఆదివారం జిల్లా కేంద్రంలోని 23 పరిక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుందని అదనపు కలెక్టర్‌ శ్రీ చంద్రమోహన్‌ అన్నారు. టిఎస్‌ టెట్‌ – 2022 చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లకు, రూటు ఆఫీసర్లకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిక్షకి సంబందించి …

Read More »

మీ భవిష్యత్తుకు మీరే మార్గనిర్దేశకులు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి స్పష్టం చేశారు. ఏకాగ్రతతో చదువుతూ, పక్కా ప్రణాళికతో సన్నద్దమైతే కోరుకున్న ప్రభుత్వ కొలువును దక్కించుకోవడం కష్టమైన పనేమీ కాదని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవగాంధీ ఆడిటోరియంలో పోలీస్‌ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతీ, …

Read More »

ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. అదేవిధంగా 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ హైదరాబాద్‌ వారు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు 20 సీట్లు కేటాయించారు. మూడో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »