gandari

రైతులను ఆదుకోవడంలో రాజకీయానికి చోటు లేదు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ గాంధారి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు చోటు ఉండకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జహీరాబాద్‌ పార్లమెంట్‌ ప్రవాస యోజన రైతు సమ్మేళనంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పతకాలను …

Read More »

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

గాంధారి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం గాంధారి మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సురేందర్‌, ఎంపీ బీబీ పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు …

Read More »

గ్రూప్‌ రాజకీయాలు చేస్తే గుణపాఠం తప్పదు

గాంధారి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీలో గ్రూప్‌ రాజకీయాలు చేస్తే కార్యకర్తలు గుణపాఠం చెబుతారని గాంధారి కాంగ్రెస్‌ నాయకులు మదన్‌ మోహన్‌ రావు ను హెచ్చరించారు. శనివారం మండల కేంద్రం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ లో గ్రూప్‌ రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్న మదన్‌ మోహన్‌ రావుకు కాంగ్రెస్‌ …

Read More »

ఉచిత బస్‌ సర్వీస్‌ ప్రారంభం

గాంధారి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్దులు, వికలాంగులు, మహిళల కోసం ఉచిత బస్‌ సర్వీస్‌ ను సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ప్రారభించారు. గాంధారి మండల కేంద్రం నుండి కామారెడ్డి వరకు బస్‌ నడపనున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి తన స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ బస్‌ సర్వీస్‌ కొనసాగుతుందని అన్నారు. ప్రతి రోజు …

Read More »

మిషన్‌ భగీరథ అధికారులుపై ఎమ్మెల్యే ఆగ్రహం

గాంధారి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తగు నీరు అందించే పథకం అని,అలాంటి పథకం అమలు కావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ …

Read More »

ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ప్రభుత్వం మాదే

గాంధారి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలతో కలిసి మమేకమై పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను అందజేశారు.స్థానిక రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో చెక్కులతో పాటు తన స్వంత ఖర్చులతో ఒక్కో లబ్ధిదారునికి పట్టు చీరను ఎమ్మెల్యే బహుకరించారు. ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ …

Read More »

కాంగ్రెస్‌ నాయకులారా ఖబడ్దార్‌

గాంధారి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ నాయకులారా ఖబడ్దార్‌. తమ నాయకునిపై బురదజల్లే మాటలు మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెరాస నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌పై చేసిన ఆరోపణలకు దీటుగా సోమవారం గాంధారి తెరాస నాయకులు సమాధానం ఇచ్చారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …

Read More »

శ్రీరామమందిర నిర్మాణానికి భూమి పూజ

గాంధారి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో శ్రీ సీతా రామ మందిర నిర్మాణానికి భక్తులు ముందుకువచ్చారు. ఇందులో భాగంగా స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయం సమీపంలో సోమవారం శ్రీ రామ భక్తులు తాత్కాలిక శ్రీ హనుమాన్‌, లక్ష్మణ్‌ సమెత సీతా రాముల మూర్తులను ప్రతిష్టించి భూమి పూజ నిర్వహించారు. శ్రీ హనుమాన్‌ మాలలు వేసుకున్న స్వాములు, గ్రామ పెద్దలు, నాయకులు పూజ …

Read More »

పంటలను పరిశీలించిన వ్యవసాయధికారి

గాంధారి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో వరి, మొక్కజొన్న పంటలను వ్యవసాయధికారి నరేష్‌ బుధవారం పరిశీలించారు. మండలంలోని ముదోలి గ్రామ పరిధిలోని వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడుత, జింక్‌ లోపాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీటి నివారణకు కార్టప్‌ హైడ్రో క్లోరైడ్‌ 400 గ్రాములు లేదా క్లోరాన్‌ ట్రయినిలిప్రోల్‌ 60 మి.లి. వేప నూనెలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలనీ రైతులకు సూచించారు. …

Read More »

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

గాంధారి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గాంధారి మండలం హేమ్లానాయక్‌ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. సదాశివనగర్‌ సిఐ రామన్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హేమ్లానాయక్‌ తండాకు చెందిన వివాహిత రాతలా రేఖ (37) కనిపించడం లేదని సోమవారం గాంధారి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు తెలిపారు. సోమ్లా నాయక్‌ తండాకు చెందిన రేఖకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »