gandari

సొసైటీ అభివృద్ధికి కృషి

గాంధారి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల సొసైటీ పాలకవర్గ సమావేశం పెద్దభూరి సాయికుమార్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. సమావేశంలో సొసైటీ అభివృద్ధితో పాటు పలు అంశాలను చర్చించారు. సొసైటీ అభివృద్ధి కొరకు అందరూ కృషి చేయాలనీ చైర్మన్‌ సాయికుమార్‌ కోరారు. సభ్యుల నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఉదల్‌ సింగ్‌, డైరెక్టర్లు అశోక్‌ రెడ్డి, తాడ్వాయి సంతోష్‌, వజీర్‌ …

Read More »

చెక్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభం

గాంధారి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని వాగులో సంగెం రేవు వద్ద నిర్మించే చెక్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌ బుధవారం ప్రారంభించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని క్లస్టర్‌గా తీసుకోని 16 చెక్‌ డ్యామ్‌లను ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మంజూరు చేశారని ఆయన తెలిపారు. సుమారు 36 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం కొనసాగుతుందని అన్నారు. …

Read More »

ఆక్సిజన్‌ కాన్సర్ట్రేటర్‌ అందజేత

గాంధారి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న బాధితునికి ఆక్సిజన్‌ కాన్సర్ట్రేటర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అందజేశారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వడ్ల సత్తయ్యకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే సురేందర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆక్సిజన్‌ కాన్సర్ట్రేటర్‌ను ఉచితంగా తన సహచరలతో పంపించారు. ఆక్సిజన్‌ పరికరాన్ని …

Read More »

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మౌన దీక్ష

గాంధారి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మౌన దీక్ష చేపట్టారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్బంగా కాంగ్రెస్‌ శాసన సభ ప్రతిపక్ష నాయకుడు బట్టీ విక్రమార్కను అసెంబ్లీ లో అవమాన కరంగా మాట్లాడం మండల కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టి పీసీసీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం …

Read More »

గాంధారిలో ఘనంగా మహిళా దినోత్సవం

గాంధారి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గాంధారిలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను స్థానిక తహసీల్దార్‌ ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్‌ శిల్పతో పాటు మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ తూర్పు రాజులు, స్కూల్‌ చైర్మన్‌ గంగామణి, కాంగ్రెస్‌ నాయకులు కృష్ణ, నీల రవి తదితరులు పాల్గొన్నారు.

Read More »

గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం

గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని పలువురు ప్రతిజ్ఞ చేశారు. గాంధారి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు గంజాయి నిర్ములన ప్రతిజ్ఞ చేశారు. గంజాయి అనే మహమ్మారిని నిర్ములించి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతామని ప్రతిజ్ఞ చేశారు. గంజాయి అనే మత్తు పదార్థానికి అలవాటు పడి మానసిక ఒత్తిడికిలోనై అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు …

Read More »

కార్యకర్తలే నా బలం.. వారిని కాపాడే బాధ్యత నాది

గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్యకర్తలే తనకు ప్రధాన బలం అని వారిని కాపాడే బాధ్యత తనపై ఉందని జహీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జి మదన్‌ మోహన్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, తెరాసలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లింగంపల్లిలో తెలంగాణ …

Read More »

తెరాస ప్రభుత్వం పేదల పక్షం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని,దాని కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి ఇల్లు లేని …

Read More »

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన ఎంపీటీసీ భర్త కుటుంబ సభ్యులకు సాయినేని ట్రస్ట్‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం గాంధారి తెరాస నాయకులతో కలిసి సాయినేని ట్రస్ట్‌ అధినేత సత్యం రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా సత్యం రావు మాట్లాడుతూ మండలంలో ప్రజాదరణ కల్గిన ఎంపీటీసీ భర్త సురేష్‌ మరణించడం బాధాకరం అన్నారు. …

Read More »

కాంగ్రెస్‌ మండల అధ్యక్షున్ని తొలగించాలి

గాంధారి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షున్ని తొలగించాలని కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ ఇదివరకు ఉన్న కాంగ్రెస్‌ మండల అధ్యక్షున్ని తొలగించి ఎవరిని నూతనంగా ఎంపిక చేసిన తమకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »