గాంధారి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారీ మండలం ముదెల్లి గ్రామంలో ముదెల్లి నుండి పండరిపూర్ వెళ్తున్న కాలినడక భక్తులకు మదన్ మోహన్ టోపీ, మాస్క్, కండువాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో జామున వెంకట్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంపత్, గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజు, …
Read More »ఘనంగా నేతాజీ జయంతి
గాంధారి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రభోస్ 125 వ జయంతి వేడుకలను గాంధారి మండలంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సుభాష్ చంద్రభోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా స్థానిక యువజన నాయకుడు, వార్డ్ మెంబర్ నితిన్ పాటిల్ మాట్లాడుతూ బ్రిటిష్ బానిసత్వపు చీకట్లో మగ్గుతున్న భారతీయ యువతను సైనికులుగా మార్చి …
Read More »ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలి
గాంధారి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. అదేవిదంగా …
Read More »మండల సభలో బినామీలకూ అవకాశం కల్పిస్తాం
గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల సర్వ సభ్య సమావేశంలో బినామీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు అవకాశం కల్పిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సమావేశానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే సురేందర్ హాజరైయ్యారు. సమావేశానికి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరైయ్యారు. అందులో కొంతమంది …
Read More »అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్
గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ …
Read More »నేడు మండల సర్వసభ్య సమావేశం
గాంధారి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీపీ రాధా బలరాం నాయక్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ హాజరు కానున్నట్లు తెలిపారు. మండల అధికారులు తమ తమ డిపార్టుమెంట్‌కు సంబంధించిన నివేదికలతో హాజరు కావాలని కోరారు. అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తమ గ్రామాలలో …
Read More »54 మందికి కు.ని. ఆపరేషన్లు
గాంధారి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత స్థానిక ఆసుపత్రిలో కు. ని. శిబిరం నిర్వహించడంతో మంచి స్పందన వచ్చినట్లు డూప్యూటీ డిఎంహెచ్‌ఓ శోభా రాణి తెలిపారు. 54 మందికి ఆపరేషన్‌లు నిర్వహించామన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి 880 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. 100 …
Read More »చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి
గాంధారి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానంలో …
Read More »గుండెపోటు రోగికి వైద్యం చేస్తూ వైద్యునికి గుండెపోటు
గాంధారి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుండెపోటుతో వచ్చిన రోగికి వైద్యం చేస్తున్న డాక్టర్‌కు గుండెపోటు వచ్చిన సంఘటన ఆదివారం గాంధారి మండలంలో చోటుచేసుకుంది. అయితే ఇందులో రోగితో పాటు డాక్టర్ కూడా గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన బజ్యా నాయక్ (48) కు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని …
Read More »రైతులు పండిరచిన వడ్లతో రాజకీయం
గాంధారి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం రైతులు పండిరచిన వడ్లతో రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని టీజెఎస్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు రక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ నిల్వ ఉన్న వరి …
Read More »