Health & Fitness

సిజీరియన్‌ కాన్పుల నియంత్రణకు అవగాహన పెంపొందించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిజీరియన్‌ ఆపరేషన్లను నియంత్రిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజీరియన్‌ కాన్పుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

నిజామాబాద్‌లో రెండు ఆసుపత్రులు సీజ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులను బుధవారం సీజ్‌ చేశామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సదుపాయాలు, నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలచే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ, సరైన లేబర్‌ రూమ్‌, ఇతర …

Read More »

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిఆవరం మర్కజి మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌ ఉన్‌ నబి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్‌ క్రాస్‌ జిల్లా సెక్రటరీ బాస రఘుకుమార్‌, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ అహ్మద్‌ …

Read More »

టి.బి. ముక్తభారత్‌ అభియాన్‌పై సమీక్ష

దోమకొండ, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బిక్కనూర్‌, మాచారెడ్డి, రాజంపేట, అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టీబీ ముక్తాభారత్‌ అభియాన్‌ నిక్షేయ మిత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త నీలిమ మాట్లాడారు. జిల్లాలో 1113 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించామని తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో …

Read More »

మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కర్షక్‌ బి.ఎడ్‌ కళాశాలలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఎఫ్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం,రెడ్‌ క్రాస్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా విచ్చేసి మాట్లాడారు. కామారెడ్డి జిల్లా చరిత్రలో …

Read More »

బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం బస్తి దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ వాడలో మంగళవారం బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాస్థాయిలో మొదటి బస్తి దవాఖానాను కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన డాక్టర్‌ వేద ప్రకాష్‌

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మీ (35) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం బాన్సువాడ రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి తన జన్మదినం …

Read More »

క్యాంపస్‌లో 89 మందికి బూస్టర్‌ డోస్‌

డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం కూడా బూస్టర్‌ డోస్‌ టీకా క్యాంప్‌ ఏర్పాటు చేశామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. శుక్రవారం 210 మందికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయగా, శనివారం 89 మందికి వేశారని తెలిపారు. …

Read More »

వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వివిధ రోగాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దోమలు, ఈగలు పెరగడం వలన మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. అక్కడక్కడా డెంగీ కేసులు కూడా నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తక్షణంగా చర్యలు తీసుకోవాలని మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ జయనీ నెహ్రు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ …

Read More »

పక్షం రోజుల్లో పనులు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. సోలార్‌ ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »