Health & Fitness

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మి (28) గర్భిణీ రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి సింగరాయపల్లికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాలు …

Read More »

ఆరోగ్య శ్రీ సమర్థవంతంగా అమలు చేయాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యశ్రీ పథకంను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై జరిగిన శిక్షణ కేంద్రానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి వారం రోజులకు ఒకసారి …

Read More »

విద్యార్థులు సామాజిక బాధ్యత అలవరుచుకోవాలి

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం,ఐవిఎఫ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్‌ సిఎస్‌ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ విద్యార్థులు రక్త దానానికి ముందుకు రావడం …

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని, ఇకపై నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో ఐసీడీఎస్‌ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో …

Read More »

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పి.హెచ్‌.సి వారీగా …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో సీ-సెక్షన్లను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గర్భిణుల నమోదు, ఏఎన్‌సి చెకప్‌, క్షయ వ్యాధి నిర్మూలన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ …

Read More »

యువకులు రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రక్తదానంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని, ఎంతో …

Read More »

4న రక్తదాన శిబిరం

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాధుల మహేష్‌ గుప్తా, గోవింద్‌ భాస్కర్‌ గుప్తా, …

Read More »

అనాధ బాలికకు రక్తం అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి కేంద్రంలోని అనాధ ఆశ్రమంలో శిరీష (13) బాలిక రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి 3 యూనిట్ల ఓ నెగిటివ్‌ రక్తం అవసరం ఉన్నదని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన కిరణ్‌ 47 వ సారి, టేక్రియాల్‌ గ్రామానికి చెందిన రాజు 4వ సారి వీ.టి ఠాకూర్‌ రక్తనిధి …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇకపై కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి వైద్యాధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లకు సూచించారు. సరైన కారణం లేకుండా ఎవరైనా గర్భీణీలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్నట్లైతే, సంబంధిత ప్రాంత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు. నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »