Health & Fitness

రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలు అందించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలు రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ నమోదు, రక్తహీనత, హైరిస్క్‌ గర్భిణీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తో కలిసి మంగళవారం …

Read More »

ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ జిల్లా వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. గర్భిణీ స్త్రీల నమోదు, గర్భిణీ స్త్రీలలో …

Read More »

25న మలేరియా అవగాహన ర్యాలీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పిఓడిటిటి కార్యాలయం నుండి డిఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేరువేరు ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు స్వరూపకు ఏబి పాజిటివ్‌ రక్తాన్ని మరియు వనితకు ఓ పాజిటివ్‌ రక్తం సకాలంలో అందజేయడం జరిగిందని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గంప ప్రసాద్‌ తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని …

Read More »

ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య మేళా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ …

Read More »

హెల్త్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయుష్మాన్‌ భారత్‌, ఆజాదికా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం …

Read More »

స్క్రీనింగ్‌ క్యాంప్‌లు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు, మోకాలి నొప్పులతో ఇబ్బందిపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లా జనరల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా …

Read More »

కామారెడ్డిలో మెగా హెల్త్‌ క్యాంపు

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్‌ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఆయుష్మాన్‌ భారత్‌, ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఈ …

Read More »

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్‌ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ఉచిత కంటి ఆపరేషన్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీర్తిశేషులు సానెబోయిన నర్సవ్వ – బాల్‌ కిషన్‌ ముదిరాజ్‌ కామారెడ్డి జ్ఞాపకార్థము వారి కుమారుల సహాకారంతో వి.టి. ఠాకూర్‌ లయన్స్‌ కంటి హాస్పిటల్‌ కామారెడ్డి అధ్వర్యంలో ఉచితంగా కంటి పరిక్ష క్యాంపు నిర్వహించారు. ఇట్టి క్యాంపునకు కామారెడ్డి పరిసర ప్రాంతాల నుండి వచ్చి పరీక్షలు చేసుకుని అవసరమైన మందులు, కంటి అద్దాలు తీసుకున్నారు. కంటి ఆపరేషన్‌ అవసరం ఉన్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »