Health & Fitness

పక్షం రోజుల్లో పనులు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. సోలార్‌ ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

మాచారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టిబి ప్రోగ్రాం అధికారి డా.రవి కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి పిహెచ్‌సి పరిధిలో ఉన్న టీబీ కేసుల గురించి, వ్యాధిగ్రస్తులకు అందుతున్న చికిత్సల గురించి వాకబు చేశారు. వ్యాధిగ్రస్తులకు ని-క్షయ పోషణ యోజన పథకం ద్వారా డైరెక్ట్‌ …

Read More »

ఆరోగ్య కేంద్రం తనిఖీ

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్‌ టుబర్‌ క్యూలోసిస్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం సందర్శించారు. క్షయ వ్యాధి పరీక్ష నిర్ధారణ రిజిస్టర్‌ పరిశీలించారు. వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యురాలు సాయి సింధును ఓపీ నుంచి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి నిర్ధారణ పరీక్ష కొరకు ల్యాబ్‌కు పంపాలని …

Read More »

క్షయ రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్‌ టుబర్‌ క్యూలోసిస్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …

Read More »

అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా ఆపరేషన్‌

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచకిత్స చేసిన నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అత్యంత అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచకిత్స చేసిన జిల్లా ఆసుపత్రి వైద్యుల బృందానికి, సూపరింటెండేంట్‌ ప్రతిమరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. …

Read More »

రక్తదాత లావణ్య సేవలు అభినందనీయం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం రామ్‌ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన లావణ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఓ నెగెటివ్‌ రక్తాన్ని 6 సార్లు అంద చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అవసరం అని చెప్పగానే హైదరాబాద్‌కి వెళ్లి సకాలంలో …

Read More »

పిహెచ్‌సి తనిఖీ

కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల కేంద్రంలోని సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను చూశారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసిల్దార్‌ అనిల్‌ కుమార్‌, సర్పంచ్‌ సురేష్‌, వైద్యాధికారి ఆనంద్‌ యాదవ్‌, సిబ్బంది …

Read More »

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని మీటింగ్‌ హాల్‌లో ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో గర్భిణీల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని …

Read More »

విధుల నిర్వహణ కోసం అటెండెన్స్‌ యాప్‌తోనే హాజరు

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర పరిధిలోకి వచ్చే వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశ్యంతోనే అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్దతి కొనసాగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అటెండెన్స్‌ యాప్‌ ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వైద్యారోగ్య …

Read More »

జిల్లా జనరల్‌ ఆసుపత్రి తనిఖీ, కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ జిల్లా జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ నెల 18న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు జిల్లా పర్యటనకు హాజరవుతున్న సందర్భంగా జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో వృద్ధుల కోసం సుమారు 50 లక్షల రూపాయలను వెచ్చిస్తూ నూతనంగా నెలకొల్పిన ‘ఆలన’ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే స్కిల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »