ఆర్మూర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని 26 వ వార్డులో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కరోనా నివారణకై టిక ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా ఆర్‌పిలు ఇంటింటికి సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఆర్‌పిలు సమత, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Read More »వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 40 వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాన్ని, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, …
Read More »వేల్పూర్‌లో 10 సెంటర్లలో వ్యాక్సినేషన్
వేల్పూర్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మండలంలో 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని 10 ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, మండల ప్రజలు పూర్తి స్థాయిలో …
Read More »కూతురికి తండ్రి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబిరావ్ పెట్ మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన వాణి అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, రామకృష్ణలను వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కాగా రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాని సమయంలో పేషెంట్ తండ్రి నారాయణను గ్రూప్ …
Read More »డెంగ్యూ, విషజ్వరాలపై పివైఎల్ సర్వే
ఆర్మూర్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో డెంగీ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న నేపధ్యంలో వాటిని అరికట్టడానికి వైద్య సదుపాయాలు ఏ మేరకు చేపడుతున్నారు, అట్లాగే ఆర్మూర్ ప్రభుత్వఆసుపత్రిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సదర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ డెంగీ జ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని ప్రజలు తమ ఇంటిని, అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని …
Read More »డెంగ్యూ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆరోపించారు. ప్రభుత్వం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా లేదని, దీంతో నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లాలో గత కొద్దిరోజులుగా డెంగ్యూ విజృంభిస్తుందని తెలిపారు. దీనిపై జిల్లా …
Read More »అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన సౌజన్య (21)కు ఆపరేషన్ నిమిత్తమై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 44 వ సారి …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సోమారం గ్రామానికి చెందిన విగ్నేష్ కుమార్ (19) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంకులో బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ అందించి ప్రాణాలు …
Read More »మాతా శిశు ఆరోగ్య కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుఖ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అంగన్‌వాడి, ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం రూ.17.80 కోట్లతో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. నేటి …
Read More »రక్తదానం చేసిన హిందు వాహిని జిల్లా కార్యదర్శి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన హిందువాహిని జిల్లా కార్యదర్శి సాయి ప్రణయ్ చారి సహకారంతో వారికి కావాల్సిన ఏ పాజిటివ్ రక్తం అందజేశారు. ఈ సందర్బంగా బోనగిరి శివకుమార్ మాట్లాడుతూ …
Read More »