నారాయణఖేడ్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శంకరంపేట్ మండలం, పట్టణంలో తెలంగాణా ఆడపడుచులకు ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పిటిసి విజయరామరాజు, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ …
Read More »ఎస్‌బిఐ ఫౌండేషన్, భవిష్య భారత్ ఆధ్వర్యంలో 3కె మారథాన్
నారాయణఖేడ్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ డివిజన్ మనూర్ మండలం ఉసిరికపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ఎస్‌బిఐ, భవిష్య భారత్ వార్ల ఆధ్వర్యంలో 3కె మారథాన్ నిర్వహించారు. మారథాన్‌లో పాల్గొనడానికి మనూర్, రెగోడ్, రాయికోడ్, వటపల్లి మండలాల నుండి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ధన్వార్ ఎక్స్ రోడ్ నుండి గటిలింగంపల్లి శివారు వరకు 3కె పరుగుపందెం నిర్వహించారు. …
Read More »గోర్గల్ చెరువులో చేప పిల్లల విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం నుండి గోర్గల్ దేవుని కుంట చెరువులో నాయకులు పిరిని సాయిలు, గ్రామ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సుభాష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి కలసి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 100 శాతం రాయితీ కింద చేపపిల్లలను ఇవ్వడం జరిగిందని వాటిని చెరువులో విడుదల చేశామన్నారు.
Read More »బైపాస్ రోడ్డు మరమ్మత్తు
నారాయణఖేడ్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్ పట్టణంలో రోడ్లు, ఇండ్లు దెబ్బతిన్నాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మున్సిపల్ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు ఇచ్చిన హామీని సత్వరమే అమలు చేశారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం గురువారం పట్టణంలోని బైపాస్ రోడ్డు నుండి సేవాలాల్ చౌక్ వరకు దెబ్బతిన్న రోడ్డును ఖేడ్ మున్సిపల్ కమిషనర్ మల్ల రెడ్డి, …
Read More »గంజాయి మొక్కలను దగ్దం చేసిన ఆబ్కారీ అధికారులు
నారాయణఖేడ్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరకు పంటలో అంతరపంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న పొలంలో దాడి చేసి గంజాయి మొక్కలను దగ్దం చేసినట్లు నారాయణఖేడ్ ఆబ్కారీ సీఐ మహేష్ తెలిపారు. మనూర్ మండలం బాదల్ గమ గ్రామానికి చెందిన బి.సంజీవులు అనే రైతు చెరుకు పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు. 150 గంజాయి మొక్కలను గుర్తించి …
Read More »ఆరుతడి పంటలపై అవగాహన
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో యాసంగిలో ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి అమర్ ప్రసాద్ మాట్లాడారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, కుసుమ, శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, చెకు, ఆయిల్ పామ్ వంటి పంటలను పండిరచాలని రైతులకు వివరించారు. తరచుగా వరి పంట వేయడం వల్ల కలిగే …
Read More »వందశాతం కరోనా టీకాలు పూర్తి
నారాయణ ఖేడ్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ మండలంలోని చల్లగిద్ద తాండలో వందశాతం కరోన టీకాలు పూర్తయినట్లు నారాయణఖేడ్ ఎంపీపీ కర్ర చాందీ భాయి చౌహన్ అన్నారు. బుధవారం చల్లగిద్ద తాండలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి తుర్కపల్లి ఆస్పత్రి వైద్యులు రాజేష్‌తో కలసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో వంద శాతం కరోన వ్యాక్సిన్ వేసుకున్న మొదటి గ్రామపంచాయతి అని, దీనిని …
Read More »పంట నష్టం వివరాలు సేకరణ
నారాయణ ఖేడ్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించడం జరిగిందని ఏ.డీ.ఏ కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పంటలు పరిశీలనలో భాగంగా మనూర్ మండలం పులకుర్తి గ్రామ శివారులో మండల ఏ.వో శ్రీనివాస్ రెడ్డితో కలసి పత్తి, చెరకు పంటలను పరిశీలించిన సందర్బంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసి దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు …
Read More »ప్రమాదపుటంచున పర్యాటకుల సెల్ఫీలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేయడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. దీనికి అనుగుణంగా చత్రి గోల్ బంగ్లా దగ్గర నీటిలో పర్యాటకులు దిగి ప్రమాదం అంచున సెల్ఫీలు దిగుతున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గేట్ల ముందు భాగంలో అలల వద్ద పర్యాటకులు ఫోటోలు దిగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కానీ నీటిపారుదల శాఖ అధికారులు …
Read More »నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల నీటి విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు 7 వరద గేట్ల ద్వారా 59 వేల 200 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరిగిందని ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 1,2,3,6,7,11,12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఎగువ భాగం నుంచి ఇన్ ఫ్లో 42 వేల 300 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులో …
Read More »