Political

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు… ప్రజాస్వామ్యానికే ప్రమాదం

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్‌ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్‌ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రాణాలు అర్పించారని, నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్‌ గాంధీపై కేసు పెట్టడం సరైనది కాదని మాజీ మంత్రి …

Read More »

ఉక్కు పాదంతో గంజాయిని నిర్మూలించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అధునాతన సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను శుక్రవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సిపి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. సి సి కెమెరా విభాగం, ట్రాఫికింగ్‌ సిగ్నల్‌ కెమెరాలు, సైబర్‌ క్రైమ్‌, సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి అల్లర్లు సృష్టించే వారిపై …

Read More »

భీంగల్‌లో తపాలా బీమా మహా లాగిన్‌ డే…

బీమ్‌గల్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మున్సిపల్‌ పరిధిలో శుక్రవారం పోస్టల్‌ శాఖ తపాలా బీమా లాగిన్‌ డే సందర్భంగా ఆర్మూర్‌ సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో 16 గ్రామాల బ్రాంచ్‌ పోస్టుమాస్టర్లు, సహాయ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్మూర్‌ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏబీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ఉదయాన్నే వెళ్లి పిఎల్‌ఐ, ఆర్పీఎల్‌ఐ …

Read More »

కామారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీకి కారకులైన కేటీఆర్‌ మంత్రి పదవి నుండి భర్తరఫ్‌ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే …

Read More »

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం

హైదరాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్‌ జాగృతి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో …

Read More »

రూపాయి ఖర్చు లేకుండా

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్లు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం నిరుపేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ హాజరై మాట్లాడారు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉండాలనే …

Read More »

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

గాంధారి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్‌ సే హత్‌ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్‌ గ్రామం …

Read More »

కవిత్వం ఒక సామాజిక బాధ్యత

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్య సృజన ప్రయాణం లో కవులు తప్పకుండా సామాజికబాధ్యతతో, వ్యవహరించాలనీ, రాశి గల కవిత్వం కాకుండా వాసి గల కవిత్వం రాయాలనీ, కవులను ఉద్దేశించి సాహితీసేవలో గజారోహణ సత్కారం పొందిన విద్వద్కవి, శిరోమణి డా.అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. ఆదివారం డాక్టర్‌ గణపతి అశోక శర్మ స్వగృహంలో జరిగిన సాహిత్య అమృతోపన్యాస పరంపరలో భాగంగా మొదటి ఉపన్యాసాన్ని నటేశ్వర …

Read More »

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం

రెంజల్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపులో భాగంగా టిఎస్పిఎస్సిలో పేపర్స్‌ లీకేజ్‌ జరిగిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్‌ యాదవ్‌ మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీలో పేపర్స్‌ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో చక్కర కర్మాగారం తెరిపిస్తాం

బోధన్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నిజాం షుగర్‌ కర్మాగారం తెరిపిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన హాత్‌ సే హాత్‌ జోడయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బోధన్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »