నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడిరచారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన కట్లకుంట బసవవ్వ (58)కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ నిమిత్తమై బిపాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. నిజామాబాద్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బచ్చు శ్రీధర్ సహకారంతో గజానంద్ ఇండస్ట్రీలో సూపర్ …
Read More »రెంజల్‌లో బీఆర్‌ఎస్ సంబరాలు
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగిన …
Read More »ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ చౌరస్తా దగ్గర కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్ జైన్ …
Read More »వసతి గృహాలను పరిశీలించిన రాష్ట్ర అధికారులు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహ సముదాయాన్ని బుధవారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణి సందర్శించారు. విద్యార్థినుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. భోజనశాలను చూశారు. పరిసరాల్లో ఉన్న మొక్కలను పరిశీలించారు. వసతి గృహం ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. రామారెడ్డి …
Read More »ప్రజావాణికి 72 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు …
Read More »గ్రహణం సందర్బంగా ఆలయాల మూసివేత
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూర్య గ్రహనం సందర్బంగా మంగళవారం బోధన్ నియోజక వర్గంలోని పలు ఆలయాలకు తాళాలు పడ్డాయి. ఆలయాల ద్వారాలు మూసి వేయడంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పూజలన్నీ బంద్ అయ్యాయి.. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలన్ని బంధనం చేసారు. ఆలయాల్లోని అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఈ …
Read More »ధరణి సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలంలో ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆద్వర్యంలో ఎంఆర్‌వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరు శ్రీకాంత్ మాట్లాడుతూ గత నెల బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారం …
Read More »మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్ సీజన్ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకుడు వి.మోహన్ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల …
Read More »ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా నిలిపినందుకు శుభాకాంక్షలు
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా 4 అవార్డులను అందుకున్నందుకుగాను శుభాకాంక్షలు తెలిపామని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త బాలు, గంప ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఉప్పల …
Read More »